Begin typing your search above and press return to search.
ఫిల్మ్ ఫేర్ క్రేజ్ తగ్గిందా? మెగా ఫ్యామిలీలో విభేదాలా?
By: Tupaki Desk | 12 Oct 2022 2:30 AM GMTఒకప్పుడు ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కడం అంటే చాలా గొప్ప విషయం... చాలా గొప్ప గౌరవంగా భావించేవారు. ఇప్పుడు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ల గురించి జనాలు లైట్ తీసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయం ఏంటీ అంటే ఫిల్మ్ ఫేర్ 2021 కార్యక్రమం తాజాగా జరిగింది. ఆ కార్యక్రమంలో పుష్ప సినిమా కు పలు కేటగిరీల్లో అవార్డులు వచ్చిన విషయం తెల్సిందే.
పుష్ప సినిమా కు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నాడు. అవార్డును అందుకున్న అల్లు అర్జున్ ను అభినందిస్తూ మెగా ఫ్యామిలీ నుండి ఏ ఒక్క హీరో ట్వీట్ చేయలేదు. సరే కనీసం అభిమానులు అయినా ట్వీట్స్ చేయడం లేదా సోషల్ మీడియాలో సందడి చేశారా అంటే భారీ ఎత్తున కాదు.. ఒక స్థాయి వరకు అల్లు అర్జున్ అభిమానుల వరకు సోషల్ మీడియా సందడి చేశారు.
పుష్ప సినిమా అన్ని అవార్డులను దక్కించుకోవడంతో పాటు స్వయంగా బన్నీ ఉత్తమ నటుడు గా అవార్డు అందుకున్న కూడా మెగా ఫ్యామిలీ నుండి రియాక్షన్ లేక పోవడంతో ఇందుకే మెగా ఫ్యామిలీ లో గొడవలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు నిజం కాదని ఇప్పుడు అనగలమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి కొందరు మెగా ఫ్యామిలీ మధ్య గొడవలు కాదు కానీ.. ఫిల్మ్ ఫేర్ అవార్డుల గురించి ప్రస్తుతం గతంలో మాదిరిగా సీరియస్ నెస్ లేదు అలాగే క్రేజ్ లేదు. అందుకే బన్నీ ఫిల్మ్ ఫేర్ దక్కించుకున్నా కూడా మెగా ఫ్యాన్స్ స్పందించక పోయి ఉండవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బన్నీకి వచ్చిన ఫిల్మ్ ఫేర్ గురించి పెద్దగా చర్చ జరగక పోవడం పై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
పుష్ప సినిమా సూపర్ హిట్ అయ్యింది కనుక అవార్డులు రావాల్సిందే.. మరి ఫిల్మ్ ఫేర్ వస్తే ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. ముందు ముందు జరగబోతున్న ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక తర్వాత సోషల్ మీడియా సందడి ఎలా ఉండబోతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.