Begin typing your search above and press return to search.
డీజే టిల్లుతో ప్రొడ్యూసర్స్ మైండ్ సెట్ మారిందా?
By: Tupaki Desk | 24 Dec 2022 11:30 PM GMTటాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే. బడ్జెట్ తో పాటు హీరోల, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల రెమ్యునరేషన్ లు, నెలల తరబడి కాల్షీట్స్ అంతా తడిసిమోపెడవుతోంది. ఇంత రిస్క్ చేసినా కొన్ని సందర్భగాల్లో వచ్చిన మొత్తం వడ్డీలకే సరిపోతున్న ఉదంతాలు కూడా వున్నాయి. బ్లాక్ బస్టర్, యావరేజ్ హిట్ పడితేనే నిర్మాత లాభాల బాటపడుతున్నాడు. దీంతో చాలా వరకు నిర్మాతలు స్టార్ లతో కంటే మినిమమ్ బడ్జెట్ సినిమాల వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.
సిద్దూ జొన్నలగడ్డ నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ `డీజే టిల్లు`. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ చిన్న సినిమాల్లో అనూహ్య విజయాన్ని సాధించిన ఔరా అనిపించింది. వసూళ్ల పరంగానూ భారీ సినిమాలకు థీటుగా కలెక్షన్ లని రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 30 కోట్లు రాబట్టి ఆశ్చర్య పరిచింది. ఈ మూవీ ఫలితంతో నిర్మాతల మైండ్ సెట్ మారినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం మారిన సమీకరణాలని దృష్టిలో పెట్టుకుని కొత్త కథలతో మినిమమ్ గ్యారెంటీ హీరోలతో కోటి, కోటిన్న బడ్జెట్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ కూడా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. `లవ్ టుడే`, డీజే టిల్లు తరహాలో హిట్టయితే నిర్మాతకు కాసుల పండగే. ఈ విషయాన్ని గ్రహించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు ప్రత్యేకంగా ఓ టీమ్ ని అరెంజ్ చేసి కోటి, కోటిన్నర బడ్జెట్ లో తెరపైకి తీసుకొచ్చే విధంగా చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ స్టోరీస్ ని వింటున్నారట.
కొత్త కథలతో వచ్చే వారిని ప్రోత్సహిస్తూ మినిమమ్ బడ్జెట్ తో సినిమాలు, సిరీస్ లు చేస్తూ కొత్త తరహా బిజినెస్ కి శ్రీకారం చుట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మారుతితో కలిసి రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో `ఇంటింటి రామాయణం` నిర్మించారు. ప్రస్తుతం ఇది ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదే తరహాలో మరిన్ని కథలని ఓటీటీల కోసం రెడీ చేస్తున్నారట. ఇదే తరహాలో దిల్ రాజు కూడా కమెడియన్ వేణు డైరెక్షన్ లో `బలగం` అనే పేరుతో ఓ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వీరి తరహాలోనే మరి కొంత మంది ప్రొడ్యూసర్ లు కూడా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.