Begin typing your search above and press return to search.

'కేజీఎఫ్ 2'కు ట‌ఫ్‌ ఫైట్ ఇప్ప‌డే మొద‌లైందా?

By:  Tupaki Desk   |   29 April 2022 11:30 AM GMT
కేజీఎఫ్ 2కు ట‌ఫ్‌ ఫైట్ ఇప్ప‌డే మొద‌లైందా?
X
క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ న‌టించిన హైవోల్టేజ్ యాక్ష‌న్ డ్రామా 'కేజీఎఫ్ 2' బాక్సాఫీస్ వ‌ద్ద త‌న డ్రీమ్ ర‌న్ ను కొన‌సాగిస్తోంది. దాదాపు నాలుగేళ్ల క్రితం విడుద‌లైన 'కేజీఎఫ్ కు కొన‌సాగింపుగా విడుద‌లైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా విజ‌య‌దుందుభి మోగిస్తూ రికార్డులని తిర‌గ‌రాస్తోంది. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ చిత్రం ఉత్త‌రాదిలోనూ స్వైర విహారం చేస్తూ కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ హ‌వా మామూలుగా లేదు. రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

రెండు వారాలు భారీ స్థాయిలో ప్ర‌భంజ‌నం సృష్టించిన ఈ యాక్ష‌న్ డ్రామా మూడ‌వ వారంలో మాత్రం ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో కాస్త స్లో అయిన‌ట్టుగా క‌నిపించింది. అయినా స‌రే ఎక్క‌డా క‌లెక్ష‌న్ లు మాత్రం త‌గ్గ‌డం లేదు. తెలంగాణ‌లో అందులోనూ నైజాం ఏరియాలో ఈ మూవీ 40 కోట్ల షేర్ కి చేరువ‌లో వుండ‌టం విశేషంగా చెబుతున్నారు. ఓ డ‌బ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో నైజాం ఏరియాలో క‌లెక్ట్ చేయ‌డం ఇదే తొలి సారి కావ‌డంతో ఓ రికార్డుగా చెబుతున్నారు.

ఈ మోన్‌స్ట‌ర్ ధాటికి ఎద‌రు రాలేక చాలా వ‌ర‌కు చిన్న చిత్రాలు ప్ర‌క‌టించిన రిలీజ్ డేట్ ల‌ని మార్చేసి త‌మ సినిమాల‌ను మేక‌ర్స్ వాయిదా వేసుకోవాల్సి వ‌చ్చింది. అయితే వ‌చ్చేనెల మాత్రం 'కేజీఎఫ్ 2'కు తెలుగు సినిమా నుంచి గ‌ట్టిపోటీ త‌ప్ప‌ద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ శుక్ర‌వారం విడుద‌లైన 'ఆచార్య‌' ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో మేజ‌ర్ థియేట‌ర్ల‌ని ఆక్ర‌మించేసింది. దీంతో 'కేజీఎఫ్ 2' థియేట‌ర్లు చాలా వ‌ర‌కు త‌గ్గిపోయాయి.

ఈ నేప‌థ్యంలో ఈ శుక్ర‌వారం నుంచే రాఖీభాయ్ కి 'ఆచార్య‌' కార‌ణంగా ట‌ఫ్ టైమ్ మొద‌లైంది. తెలుగు స్టార్స్ .. మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం కావ‌డంతో 'ఆచార్య‌' .

రాఖీ భాయ్ కి గ‌ట్టి పోటీనివ్వ‌డం ఖాయం అని చెబుతున్నారు. టాక్ బ్లాక్ బ‌స్ట‌ర్ అని తేలితే ప‌రిస్థితి మ‌రోలా వుండేది కానీ సినిమాకు డివైడ్ టాక్ రావ‌డంతో కొంత వ‌ర‌కు 'కేజీఎఫ్ 2'కు వ‌చ్చిన ఇబ్బందేమీ లేద‌ని తేలిపోయింది.

ఇదిలా వుంటే రాఖీభాయ్ రాంపేజ్ ఉత్త‌రాదితో పాటు త‌మిళ‌నాడుచ క‌ర్ణాక‌ట‌లో అదే స్థాయిలో కొన‌సాగుతూ రికార్డులు మోత మోగిస్తోంది. ఉత్త‌రాదిలో ఇప్ప‌టికే హిందీ వెర్ష‌న్ 300 కోట్ల మార్కుని దాటేయ‌డంతో అక్క‌డ మరిన్ని రికార్డులు సృష్టించ‌డం కాయం అని అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. అంతే కాకుండా నార్త్ అమెరికాలో 'కేజీఎఫ్ 2' రెండు వారాల‌కే 6. 8 మిలియ‌న్ సాధించిన సంచ‌ల‌నం సృష్టిస్తోంది. త్వ‌ర‌లోనే 7 మిలియ‌న్ మార్క్ ని చేర‌డం ఖాయం అని అంటున్నారు.