Begin typing your search above and press return to search.
ప్రెస్ మీట్ కాస్త ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లానే అయ్యింది!
By: Tupaki Desk | 28 Dec 2022 4:43 AM GMTమెగాస్టార్ చిరంజీవితో సినిమా ఛాన్స్ అంటే అది మామూలు విషయం కాదు. తనకు వచ్చిన ఈ ఛాన్స్ ని అన్ని విధాలుగా వాడేసుకున్నాడు వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ. చిరంజీవి మీద అభిమానంతోనే ఆయనతో ఒక ఫోటో దిగితే చాలు అనుకున్నా బాబీ ఇప్పుడు ఆయన్ను డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగాడు. సంక్రాంతికి రాబోతున్న చిరు వాల్తేరు వీరయ్య సినిమా ప్రెస్ మీట్ మంగళవారం జరిగింది. సినిమా నుంచి 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఇంతవరకు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అన్న కారణం తో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
కానీ ఈ ప్రెస్ మీట్ కాస్త ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లానే అయ్యింది. వాల్తేరు వీరయ్య సినిమా ప్రెస్ మీట్ లో డైరెక్టర్ బాబీ లాంగ్ స్పీచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ లానే కొట్టింది. దాదాపు 20 నిమిషాల పాటు అతని స్పీచ్ సాగింది. డైరెక్టర్ గా తను తీసిన సినిమా గురించి చిరుతో తన అనుభవాల గురించి చెప్పడంలో తప్పేమీ లేదు కానీ అది ప్రెస్ మీట్ కదా అంత సేపు మాట్లాడితే బోర్ కొడుతుంది అన్న ఆలోచన ఆయనకు రాలేదు. అఫ్కోర్స్ చిరుతో తన ఫోటో ప్రయత్నాల గురించి బాబీ చెప్పిన స్టోరీ ఆసక్తికరంగానే అనిపించిందనుకోండి.
అందుకే బాబీ మాట్లాడిన 20 నిమిషాలు కూడా పెద్ద ల్యాగ్ అనిపించలేదు. కానీ ప్రెస్ మీట్ అని ఇంత స్పీచ్ ఇవ్వడం బాగాలేదని కొందరు అసంతృప్తి గా ఉన్నారు. తను చెప్పాలనుకున్న పాయింట్స్ కుదించి అలా ప్రెస్ మీట్ లో మాట్లాడాడు బాబీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడటానికి ఏముంటుంది అని అనుకోవచ్చు. అప్పుడు మాట్లాడే స్పీచ్ మరో రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. మెగా అభిమానిగా బాబీ ఆ హీరోలతో తనకున్న అనుబంధాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇంకాస్త డీటైల్డ్ గా షేర్ చేసుకుంటారని తెలుస్తుంది.
ఏది ఏమైనా డైరెక్టర్స్ ఎక్కువ సేపు మైక్ తీసుకుని మాట్లాడితే అంత వినసొంపుగా ఏమి ఉండదు. ఒకవేళ అక్కడ మాట్లాడేది త్రివిక్రమ్ అయితే మాత్రమే ఓకే అనేస్తారు. సో అలా వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ లో డైరెక్టర్ బాబీ ఎగ్జైట్ అయ్యి తన సినిమా ప్రస్థానం గురించి మాట్లాడిన తీరు అందరిని సర్ ప్రైజ్ చేసింది. అంతా ఇక్కడ మాట్లాడేస్తే ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాబీ ఏం మాట్లాడుతాడు అంటూ చర్చించుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.