Begin typing your search above and press return to search.

ట్రాలింగ్ అంత పని చేసిందా ?

By:  Tupaki Desk   |   10 Jan 2019 5:30 PM GMT
ట్రాలింగ్ అంత పని చేసిందా ?
X
సోషల్ మీడియాలో ఉన్నంత ఉత్సాహం ఆన్ లైన్ లో ఇంకెక్కడా కనిపించదన్నది వాస్తవం. ఉచితంగా అభిప్రాయాలను షేర్ చేసుకోవడంతో పాటు అభిరుచులు ఇష్టాలు కలిసే కొత్త స్నేహితులను పొందే అవకాశం ఉండటంతో అందరికి మూడు నాలుగు ఫేస్ బుక్ ఎకౌంటులు ఇన్స్ టాగ్రామ్ ఐడిలు ఉంటున్నాయి. సినిమాల మీద ఒపీనియన్స్ పంచుకోవడానికి కూడా ఇదే వేదికగా అనిపించడంతో ఇష్టం వచ్చినట్టు లైవ్ వీడియోలు వన్ లైన్ రివ్యూలు పంచుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇదే ట్రాలింగ్ కు పునాది.

ఒకప్పుడు తమ హీరోకు అపోజిషన్ గా భావించే హీరోల పోస్టర్లకు పేడ కొట్టే జమానా నుంచి మేమ్స్ పేరుతో కడుపు చక్కలైపోయే కామెడీతో నవ్వించే బ్యాచులు పేజీలు ఒక్క తెలుగు సినిమాకు సంబంధించె లక్షల్లో ఉన్నాయని ఒక రిపోర్ట్. ఇది ఇప్పుడు కొన్ని సినిమాలకు ప్రతికూలాంశంగా మారుతోంది. ఎన్టీఆర్ కథానాయకుడు దీని వల్ల బాగా ఎఫెక్ట్ అయినట్టు జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది. గత కొద్దిరోజులుగా నాగబాబు వరసబెట్టి బాలయ్యను టార్గెట్ చేస్తూ కామెంట్ అంటూ ఆరు వీడియోలు పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నేరుగా పేరు ప్రస్తావించినా ప్రస్తావించకపోయినా ఆయన ఎవరిని అంటున్నారో తెలిసిందే.

దీనికి తోడు ఎన్టీఆర్ సినిమాలోని బిట్లు స్క్రీన్ షాట్లు తీసుకుని కొందరు తయారు చేస్తున్న పోస్టర్స్ పిక్స్ సినిమాకున్న ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తోందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాత వీడియోలలో బాలయ్య టంగ్ స్లిప్ అయినవన్నీ ఇప్పుడు వివిధ ఆన్ లైన్ ప్లాట్ ఫోరమ్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా మీద ఒక తేలిక అభిప్రాయం కలిగేలా ఇవి దోహదపడుతున్నాయి. సో ట్రాలింగ్ ప్రభావం ఎంతో కొంత ఉండబట్టే ఆశించిన రేంజ్ కన్నా కలెక్షన్స్ తక్కువగా ఉన్నాయని మరో మాట వినిపిస్తోంది. 4జి నుంచి 5జి పరుగులు పెడుతున్న టెక్నాలజీ మునివేళ్ళతోనే సినిమాలను కూడా ప్రభావితం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తోంది కదూ