Begin typing your search above and press return to search.
వినాయక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా?
By: Tupaki Desk | 29 Dec 2018 10:43 AM GMTసీనియర్ డైరెక్టర్ వీవీ వినాయక్ లాస్ట్ సినిమా 'ఇంటెలిజెంట్' బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలవడంతో ఇప్పటివరకూ మరో ప్రాజెక్ట్ సెట్ కాలేదు. దాదాపుగా ఏడాది నుండి బాలయ్యతో సినిమా చేయడానికి వినాయక్ ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాను నిర్మించేందుకు నిర్మాత సీ. కళ్యాణ్ ముందుకొచ్చాడు. కానీ ఈ బాలయ్యకు కథ నచ్చకపోవడంతో వినాయక్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
బాలయ్య తన నెక్స్ట్ సినిమాను బోయపాటి శ్రీను తో చేస్తానని ఈ మధ్యే ప్రకటించాడు. దీంతో వినాయక్ మరో సీనియర్ హీరో వెంకటేష్ ను అప్రోచ్ అయ్యాడట. బాలయ్య కోసం తయారు చేసిన పవర్ఫుల్ కథను వెంకీ కి వినిపించాడని సమాచారం. వినాయక్ కథ విషయంలో వెంకీ సంతృప్తి వ్యక్తం చేశాడని త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వెంకీ - వినాయక్ కాంబినేషన్లో గతంలో 'లక్ష్మి'(2006) అనే సూపర్ హిట్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా.
వెంకీ తాజా చిత్రం 'F2' సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత మేనల్లుడు నాగ చైతన్య తో కలిసి 'వెంకీ మామ' సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు గానీ ఇంకా అది పట్టాలెక్కలేదు. ఒక వేళ ఈ సినిమాతో పాటుగా వినాయక్ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్తాడేమో వేచి చూడాలి.

Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?