Begin typing your search above and press return to search.
వివేక్ ఒబేరాయ్ మొదట నో చెప్పాడట
By: Tupaki Desk | 11 Jan 2019 9:51 AM GMTరామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ‘వినయ విధేయ రామ’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ విలన్ గా నటించడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. వివేక్ ఒబేరాయ్ హీరోగా ఈమద్య కాలంలో అవకాశాలు తగ్గడం వల్ల క్యారెక్టర్ రోల్స్ మరియు విలన్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు. హిందీలో ఇప్పటికే విలన్ గా నటించిన వివేక్ ఒబేరాయ్ ఆమద్య తమిళంలో వివేగంలో కూడా విలన్ పాత్ర పోషించాడు. తన సినిమాలో కూడా వివేక్ ఒబేరాయ్ విలన్ గా నటిస్తాడనే నమ్మకంతో బోయపాటి శ్రీను సంప్రదించాడట.
బోయపాటి శ్రీను మొదట ‘వినయ విధేయ రామ’ చిత్రంలో వివేక్ ఒబేరాయ్ కి విలన్ పాత్ర ఆఫర్ చేయగానే మొదట నో చెప్పాడట. తెలుగులో తాను రక్త చరిత్ర చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాను, విలన్ గా తెలుగు ప్రేక్షకులు నన్ను స్వీకరించరేమో అంటూ అనుమానం వ్యక్తం చేశాడట. కాని బోయపాటి శ్రీను కథ చెప్పిన తర్వాత విలనిజం హీరోయిజం రేంజ్ లో ఉందనే ఉద్దేశ్యంతో కాదనలేక పోయాడట. పవర్ ఫుల్ పాత్ర అవ్వడం వల్ల ఈ చిత్రంలో విలన్ పాత్రకు వివేక్ ఒబేరాయ్ నటించేందుకు ఓకే చెప్పాడట.
ఈ చిత్రంలో వివేక్ ఒబేరాయ్ తప్ప మరెవ్వరైనా కూడా విలన్ గా అంతగా ఆకట్టుకోరనే ఉద్దేశ్యంతో ఆయన్ను పట్టుబట్టి ఈ సినిమాకు ఒప్పించినట్లుగా బోయపాటి చెప్పుకొచ్చాడు. సినిమాలో రామ్ చరణ్, వివేక్ ఒబేరాయ్ ఢీ కొడుతుంటే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకంను బోయపాటి వ్యక్తం చేశాడు. వివేక్ ఒబేరాయ్ కి భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈ చిత్రంలో బోయపాటి నటింపజేశాడు.