Begin typing your search above and press return to search.
శారీ హ్యాష్ టాగ్ డిమాండే వేరట!
By: Tupaki Desk | 17 July 2019 5:48 AM GMTటాలెంట్ ఉంటే సరిపోదు.. దాన్ని గుర్తించేవారు.. అంతకు మించి ఒక్క ఛాన్స్ ఇచ్చేటోళ్ల అవసరం చాలా ఉండేది. సోషల్ మీడియా ఎంట్రీ తర్వాత ఒక్కటేంటి? వందల ఛాన్సులు చిక్కేస్తున్నాయి. వినూత్నంగా వ్యవహరిస్తూ రాత్రికి రాత్రి స్టార్లుగా మారిపోతున్న వారెందరో.
ఛాన్సుల కోసం ఎవరెవరి దగ్గరికో తిరగాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటో.. వీడియోతో.. అవకాశాలే వెతుక్కుంటూ వచ్చేస్తున్న పరిస్థితి. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియా అంటే వెస్ట్రన్ వస్త్రధారణతోనే ఆకట్టుకోవాలన్న ఆలోచన కొందరిలో ఉన్నా.. అదేమాత్రం నిజం కాదని చెప్పక తప్పదు.
సంప్రదాయ దుస్తులతోనూ మెరుపులు మెరిపించటమే కాదు.. ఓవర్ నైట్ గుర్తింపు పొందుతున్నోళ్లు ఎంతోమంది. ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ లో హ్యాష్ టాగ్ శారీకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వెస్ట్రన్ వస్త్రధారణకు బదులుగా సంప్రదాయ చీరకట్టుతో తమ ఫోటోల్ని పోస్టు చేస్తున్న వారికి వస్తున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
శారీ హ్యాష్ టాగ్ తో పోస్ట్ చేస్తున్న పోస్టులు పెద్ద ఎత్తున వైరల్ కావటమే కాదు.. ప్లజంట్ లుక్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. చాలామంది మహిళలు తమ ఫోటోల్ని శారీస్ తో దిగి పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా సీనియర్ నటి.. ప్రస్తుతం రాజకీయ నాయకురాలిగా బిజీగా ఉన్న నగ్మా.. ఎల్లో కలర్ శారీగా మెరిసిపోయారు. ఈ ఫోటోలో ఆమె ఎంత అందంగా ఉన్నారంటే.. అంటూ విపరీతమైన పొగడ్తలతో మెసేజ్ లు పెడుతున్నారు. చాలామంది మహిళలు చీరకున్న అందమే వేరని చెప్పటమే కాదు.. సెక్సీ లుక్ తో పాటు కంఫర్ట్ విషయంలోనూ శారీకి మించింది లేదంటున్నారు. శారీలో ఎంత అందంగా ఉన్నారన్నది.. ఒక్కసారి లుక్ వేయండి మీకే అర్థమవుతుంది. అంతేకాదు.. హ్యాష్ టాగ్ శారీని ఇట్టే ఫాలో అయిపోతారంతే.