Begin typing your search above and press return to search.
6.5 కోట్లు మేకింగ్ కి 50 కోట్లు లాభమా?
By: Tupaki Desk | 13 Dec 2015 7:30 AM GMTఇంత చిన్న బడ్జెట్ తో తెలుగు సినిమానే తీయలేం. కానీ బాలీవుడ్ లో సినిమానా? సాధ్యమయ్యే పనేనా? కానీ సాధ్యమైంది. 6.5 కోట్లు మేకింగ్ ఖర్చు. ప్రచారం ఖర్చు కలుపుకుని 13.2కోట్లు. మరీ ఇంత చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా మహా హిట్టయితే ఎంత వసూలు చేస్తుంది. ఓ 20 కోట్లు అనుకోవచ్చు. కానీ ఈ బాలీవుడ్ సినిమా ఏకంగా తొలివారంలోనే 42.2 కోట్లు వసూలు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సక్సెస్ దాచుకోలేనిది. అందుకే నిన్నటిరోజున చిత్రయూనిట్ అంబరాన్నంటేలా సంబరాలు చేసుకుంది.కేక్ లు కట్ చేసుకుని పండగ చేసుకుంది. వాటిని ఇటు టాలీవుడ్ లోనూ ప్రమోట్ చేసేస్తున్నారు. అసలింతకీ ఏ సినిమా గురించి ఇదంతా?
ఎస్.. రీసెంటుగా బాలీవుడ్ లో రిలీజై ఘనవిజయం సాధించిన `హేట్ స్టోరీ-3` గురించే. జరైన్ ఖాన్ - షర్మాన్ జోషి - కరణ్ సింగ్ గ్రోవర్ - డెయిసీ షా నాయకానాయికలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టేసింది. హేట్ స్టోరీ సిరీస్ లో మొదటి రెండు సినిమాల్ని మించి విజయం సాధించింది. మొదటి వారం 42 కోట్లు వసూలు చేసి ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది. ఫుల్ రన్ లో 50 కోట్లు మించి, 80 కోట్ల మార్కుని తాకినా ఆశ్చర్యం అక్కర్లేదని చెబుతున్నారు. అయితే ఈ రేంజులో ఈ సినిమా విజయం సాధించడం వెనక ఎరోటిక్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్లస్ అయ్యాయని తరణ్ ఆదర్శ్ లాంటి విశ్లేషకులు చెబుతున్నారు. పైగా జరైన్ ఖాన్ అందాలు - డెయిసీ షా ఎక్స్ పోజింగ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యాయని, గ్లామర్ ఫెస్టివల్ యూత్ ని థియేటర్లకు రప్పించిందని విశ్లేషిస్తున్నారు. అదీ మ్యాటరు.