Begin typing your search above and press return to search.
సమంత గట్స్ కి హ్యాట్సాఫ్ అనాల్సిందే!
By: Tupaki Desk | 16 Nov 2022 12:25 PM GMTకెరీర్ విషయంలో కొంత మంది దడబాటుకు గురవుతుంటారు. మరి కొంత మంది మాత్రం ఎన్ని అడ్డంకులు.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా తొణకరు బెనకరు. స్టడీగా వుంటూ తమకు ఏం కావాలో.. తాము ఏం చేయగలమో అవే ఉంచుకుంటూ ముందుకు సాగుతుంటారు. క్రేజీ హీరోయిన్ సమంత కూడా అంతే. తన కెరీర్ పరంగా, వ్యక్తగత జీవితం పరంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా నిలబడింది. అంతే ధైర్యంగా తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది.
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత కొంత మస్తాపానికి గురైనా ఆ తరువాత తేరుకుని మళ్లీ సినిమాలు చేయడం మొదలు పెట్టింది. రీసెంట్ గా మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నా దాన్ని జయించి మళ్లీ నిలబడతానని ధీమాగా చెబుతోంది. వ్యక్తగత, వృత్తిపరమైన విషయాల్లో ఫుల్ క్లారిటీతో వున్న సమంత రీసెంట్ గా `యశోద`తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
ఈ మూవీ మంచి టాక్ తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ మూవీ తరువాత విజయ్ దేవరకొండ తో `ఖుషీ` మూవీలో నటిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్ లో వరుణ్ థావన్ తో ఓ సిరీస్ లో నటిస్తోంది. తను నటించిన `శాకుంతలం` త్వరలో రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇదిలా వుంటే సమంత క్రేజీ ప్రాజెక్ట్ లని సున్నితంగా రిజెక్ట్ చేసినట్టుగా తెలిసింది. చియాన్ విక్రమ్ తో శంకర్ తెరకెక్కించిన `ఐ` మూవీ కోసం ముందు సామ్ నే అడిగారట.
అయితే సామ్ ఈ మూవీని సున్నితంగా తిరస్కరించిందట. ఆ తరువాత `పుష్ప`లో శ్రీవల్లిగా ముందు సామ్ నే సుకుమార్ అడిగాడట. అయితే అనివార్య కారణాల వల్ల సమంత .. సుకుమార్ ఆఫర్ ని కూడా వదుకుందని చెబుతున్నారు. అయితే ఆ తరువాత ఇదే సినిమాలో సామ్ స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీని తిరస్కరించిన సామ్ లో ఇంత మాత్రం రిగ్రెట్ కనిపించలేదని అంటున్నారు.
రీసెంట్ గా మరో పాన్ ఇండియా మూవీలో నటించే అవకాశం వచ్చిందట. షారుఖ్ ఖాన్ తో అట్లీ కుమార్ `జవాన్` మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో షారుఖ్ కు జోడీగా సామ్ ని సంప్రదించారట.
అయితే ఆ ఆఫర్ ని కూడా వ్యక్తగత కారణాల వల్ల తిరస్కరించి షాకిచ్చిందట సామ్. మరో హీరోయిన్ అయితే ఈ ఆఫర్లని తిరస్కరించేది కాదు. కానీ సామ్ అలా కాదు తను ఏ సినిమా చేయగలతో ఆ సినిమాలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఆ కారణంగానే తనని వెతుక్కుంటూ వచ్చిన క్రేజీ ఆఫర్లని సామ్ తిరస్కరించిందని.. ఈ విషయంలో సామ్ గట్స్ కి హ్యాట్సాఫ్ అనాల్సిందే అంటున్నారు సామ్ ఫ్యాన్స్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.