Begin typing your search above and press return to search.
సమంత కి హ్యాట్సాఫ్..ఇలా చేయాలంటే దమ్ముండాలి!
By: Tupaki Desk | 29 Dec 2022 1:30 PM GMTఇండస్ర్టీలో హీరోయిన్ గా రాణించడమే పెద్ద సవాల్. అందులోనూ సక్సెస్ అయిన హీరోయిన్ ఆ క్రేజ్ ని నిలబెట్టుకోవడం కోసం నిరంతరం శ్రమించాల్సిందే. ఎంతో ఒత్తిడిని జయించి ముందుకు సాగాలి. ఇలా ఎంత కష్టపడినా కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే పరిస్థితులు వెనక్కి లాగిపెడుతుంటాయి. వాటిని తట్టుకుని నిలబడటం మాత్రం అంత సులభమైన కాదు. అప్పుడే మనలో నిజమైన ఖలేజా బయటపడుతుంది.
గట్స్ ఉన్న వాళ్లు మాత్రమే ఆ ఫేజ్ ని దాటి సక్సెస్ ని కంటున్యూ చేయగలరు. అలాంటి వాళ్లలో సమంత ఒకరుగా తప్పక చెప్పాలి. కెరీర్ పీక్స్ లో ఉండగా నాగచైతన్యతో వివాహం..అటుపై విడాకులు సంఘటన తో సమంత ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లి బయటకు వచ్చిందో తెలిసిందే. ఆ ఒత్తిడిని...ప్రేమ.. పెళ్లి జ్ఞాపకాల్ని మరిచిపోయి కొత్త జీవితం ప్రారంభించింది అనుకుంటోన్న సమయంలో అనారోగ్యం బారిన పడింది.
మయోసైటిస్ జబ్బు బారిన పడటంతో? సినిమాలన్ని ఒక్కసారిగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అయినా ఆ జబ్బుని గుండె నిబ్బరంతో ఎదుర్కుని నిలబడింది. నేడు మళ్లీ రాకెట్ లా ముందుకు దూసుకొస్తుంది. ఇలా ఎంత మంది చేయగలరు? అంటే అలాంటి వాళ్లని వేళ్లపైనే లెక్కించగలం. సాధారణంగా హీరోయిన్లు ఎవరూ వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పడానికి ఇష్టపడరు.
అలా చేసే వృత్తి గత జీవితంపై ప్రభావం పడుతోంది అన్నభయంతో చాలా విషయాలు దాచేస్తారు. అందులోనూ అనారోగ్యానికి సంబంధించిన విషయాలు లీక్ అయ్యాయంటే? అవకాశాలు చేజారిపోతాయి. అడ్వాన్సులు ఇవ్వాలనుకున్న నిర్మాతలో వెనక్కి వెళ్లిపోతారు. డైరెక్టర్లు మరో హీరోయిన్ ని ఆప్షన్ గా చూసుకుంటారు. కానీ సమంత ఈ విషయాలేవి దాచపెట్టలేదు.
తనకెదురైన ప్రతీ అనుభవాన్నిమీడియా ముందు ఉంచింది. ఇంకా చెప్పాలంటే? ఈ విషయంలో సమంత చూపించిన ధైర్యం మరో నటి ఇంతవరకూ చూపించలేదనే చెప్పాలి. ఒక సమస్య నుంచి బయట పడ్డ వెంటనే? మరోక ఇబ్బందిలో పడి తేరుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఇలాంటి సమయాల్లో కేవలం ఆత్మ విశ్వాసంతోనే బయట పడగలం అన్నది గ్రహించాల్సిన అంశం. సమంత దగ్గర కోట్ల రూపాయలున్నా?...ఆవేమి సామ్ మనోవేదనని దూరం చేయలేదు. కేవలం ధృడ సంకల్పంతోనే అన్నిరకాల సమస్యల్ని జయించిందన్నది వాస్తవం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.