Begin typing your search above and press return to search.

ముచ్చటగా మూడో మెగా దెబ్బ

By:  Tupaki Desk   |   1 April 2019 11:04 AM IST
ముచ్చటగా మూడో మెగా దెబ్బ
X
మెగా డాటర్ మూడో సినిమా సూర్యకాంతం రిజల్ట్ మీద పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ వీకెండ్ లో సైతం నీరసమైన కలెక్షన్లతో నీహారికకు హ్యాట్రిక్ డిజాస్టర్ ఖరారు చేసింది. కేవలం నీహారిక యాక్టింగ్ టాలెంట్ ని షో కేస్ చేయడానికి తప్ప అసలైన కథా కథనాల విషయంలో దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి సరిగా వర్క్ చేయకపోవడం ఇప్పుడు ఫలితం మీద ప్రభావం చూపిస్తోంది. ఏదో యావరేజ్ గా ఉన్నా మెగాభిమానుల సపోర్ట్ తో అంతో ఇంతో రికవర్ అయ్యే ఛాన్స్ ఉండేది. కాని సూర్యకాంతం ఆ దిశలోనూ వెళ్ళడం లేదు.

ఇంతోటి కథలో ఏముందని వరుణ్ తేజ్ స్వయంగా నిర్మించడానికి ముందుకొచ్చాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సింగల్ లైన్ మీద రెండున్నర గంటల సేపు కేవలం నీహారికను చూసేందుకు ప్రేక్షకులు రెడీగా లేరన్న విషయం స్పష్టంగా అర్థమైపోయింది. వెబ్ సిరీస్ లలో తన టాలెంట్ ని నిరూపించుకున్న నీహారికకు సక్సెస్ ఎదురు చూపులు తప్పేలా లేవు. ఇంతకు ముందు విజయ్ సేతుపతితో తమిళ్ లో ఓ సినిమా చేస్తే అదీ పోయింది. ఇక్కడ ఒక మనసు-హ్యాపీ వెడ్డింగ్-సూర్యకాంతం అన్ని తేడా కొట్టేశాయి.

ఇక నెక్స్ట్ రాబోయేది సైరా. అందులో తను కనిపించేది కేవలం ఒక్క సీన్ మాత్రమే కాబట్టి కౌంట్ లోకి తీసుకోలేం. ఇకనైనా సబ్జెక్టుల విషయంలో నీహారిక కాస్త సీరియస్ గా దృష్టి పెడితే బెటర్. తన నటనకు ఎంత స్కోప్ అనే పాయింట్ తో పాటు కథలో నిజంగా విషయముందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవడం చాలా అవసరం. లేదంటే ఇలాంటి సుర్యకాంతాలు ఎన్ని వచ్చినా లాభం ఉండదు. పోటీ లేని వాతావరణాన్ని వాడుకునే ఛాన్స్ కూడా వేస్ట్ అయిపోతుంది.