Begin typing your search above and press return to search.
రికార్డ్ బ్రేకింగ్ స్టార్ హీరో భారతీయుడు కాదా?
By: Tupaki Desk | 6 Dec 2019 5:30 PM GMTబాలీవుడ్ కిలాడీ.. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కు ఇండియన్ కాదా? అతడికి భారతీయ పౌరసత్వం లేనే లేదా? అంటే అవుననే బాలీవుడ్ క్రిటిక్స్ విమర్శిస్తుంటారు. కిలాడీ కెనడా పౌరుడు. ఆ దేశ పౌరసత్వం మాత్రమే వుంది. అయినా అక్షయ్ ఇండియాలో వుండటం ఏంటి? ఇక్కడ దేశభక్తి సినిమాల్లో నటిస్తూ దేశంపై ప్రేమ కురిపించడమేమిటో అంటూ అక్షయ్ గురించి ప్రతీసారి క్రిటిక్స్ విమర్శిస్తూనే ఉంటారు. ఆ కారణంగానే ఆయన ఇటీవల బీజేపీకి దగ్గరయ్యారని కూడా చాలా మంది బాహాటంగానే అక్షయ్ పై విమర్శలు గుప్పించారు కూడా. ఆ మధ్య కూడా అక్షయ్ కుమార్ పౌరసత్వంపై విమర్శలు వెల్లు వెత్తాయి. దానికి అక్షయ్ తనకు ఇండియాలో పౌరసత్వం లేదని.. కెనడా పౌరసత్వం మాత్రమే ఉందని అంగీకరించారు.
తాజాగా పౌరసత్వంపై బీజేపీ బిల్లు తెస్తున్న వేళ మరోసారి కిలాడీ హీరో పౌరసత్వం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది అక్షయ్ నటించిన చిత్రాలన్నీ దాదాపు వెయ్యి కోట్ల వరకు వసూళ్లను సాధించాయి. ఇలా ఖాన్ ల తరువాత ఈ స్థాయిలో వసూళ్లని రాబట్టిన హీరోగా అక్షయ్ సంచలనం సృష్టించారు. ఇంతటి మార్కెట్.. స్టార్ ఇమేజ్ వున్న అక్షయ్ కి భారతీయ పౌరసత్వం లేకపోవడం ఆసక్తికరంగా మారింది. దీని కారణంగానే అక్షయ్ చాలా ఏళ్లుగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దేశ భక్తి చిత్రాల్లో నటించిన సందర్భంలోనూ పౌరసత్వమే లేని అక్షయ్ దేశభక్తి గురించి చెప్పడం హాస్యాస్పదంగా వుందని క్రిటిక్స్ తారా స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ విమర్శల నేపథ్యంలో తన పౌరసత్వంపై అక్షయ్ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారతీయ పౌరసత్వం కోసం అర్జీ పెట్టుకున్నాను. త్వరలోనే వీసాని పొందుతాననే నమ్మకముంది. గతంలో తాను నటించిన 14 చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయని.. ఆ సమయంలో ఏదైనా చెయ్యాలనుకుంటున్న క్రమంలో కెనడాకు చెందిన మిత్రులు తనని అక్కడికి రమ్మన్నారని.. దాంతో అక్కడికి వెళ్లి కెనడా పౌరసత్వం తీసుకున్నానని.. దానివల్లనే భారతీయ పౌరసత్వాన్ని కోల్పోయానని ఈ సందర్భంగా అక్షయ్ అసలు విషయం బయటపెట్టాడు. వరుస హిట్లతో ఖాన్ లనే వెనక్కి నెట్టిన గ్రేట్ హిస్టరీ కిలాడీకి ఉంది. 2019లో 1000 కోట్ల వసూళ్లు తెచ్చిన హీరోగా రికార్డులు బ్రేక్ చేయబోతున్నాడు. సల్మాన్ తర్వాత ఆ రేర్ ఫీట్ ని అందుకోబోతున్నాడు అక్షయ్. ఇక ఈ రికార్డులు ఇంకా ఎన్ని తిరగరాస్తాడో? ఇప్పటికైనా భారతీయ పౌరసత్వం లభిస్తుందా లేదా? అన్నది వేచి చూడాలి.