Begin typing your search above and press return to search.
బన్నీ మళ్ళి ఆ రిస్క్ చేస్తాడా ?
By: Tupaki Desk | 23 April 2019 9:28 AM GMTఏడాదికి పైగా గ్యాప్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫైనల్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో రేపటి నుంచి పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే బాగా ఆలస్యమయ్యిందని ఫీలవుతున్న ఫ్యాన్స్ కోసం ఏకంగా మూడు ప్రాజెక్టులు అనౌన్స్ చేసిన బన్నీ రెండేళ్ళలో మూడు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా బౌండ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్న వేణు శ్రీరామ్ తీయబోయే ఐకాన్ కు సంబంధించిన ఒక అప్ డేట్ అభిమానులను టెన్షన్ పెడుతోంది. అదే యాంటీ క్లైమాక్స్.
నిజానికి ఈ రిస్క్ గతంలో బన్నీ ఓసారి చేసాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన వేదంలో కేబుల్ రాజుగా ఎన్నటికి మర్చిపోలేని పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అయితే అందులో ఇచ్చిన ట్రాజెడీ ఫినిషింగ్ ఎంత మనసులను తాకేలా ఉన్నా దాని ప్రభావం కమర్షియల్ రన్ మీద పడి కల్ట్ స్టేటస్ అయితే తెచ్చుకుంది కాని రేంజ్ పరంగా బయ్యర్లకు కల్పతరువు కాలేకపోయింది
అప్పటికి ఇప్పటికే అల్లు అర్జున్ ఇమేజ్ లో చాలా మార్పు వచ్చింది. మాస్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అప్పుడే రిస్క్ అనిపించింది ఇప్పుడు ఎలా ఉంటుంది అనే డౌట్ రావడం సహజం. రోడ్ జర్నీబ్యాక్ డ్రాప్ లో రూపొందే ఐకాన్ లో ఇలాంటి ఫినిషింగ్ ఉంటుందన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బన్నీ రిస్క్ చేయడం అంటే అంత ఈజీగా ఉండదు. నాని జెర్సీ లాంటి వాటిలో ఇదే వర్క్ అవుట్ అయినప్పటికీ హీరో ఇమేజ్ లో ఉండే వ్యత్యాసం ఫలితం మీద ప్రభావం చూపిస్తుంది. సో ఐకాన్ విషయంలో వస్తున్న టాక్ నిజమని చెప్పలేం కానీ యూనిట్ అయితే సీరియస్ గా దాని గురించి చర్చలో ఉన్నట్టు వినికిడి