Begin typing your search above and press return to search.
'థాంక్యూ' నిడివి బాగా తగ్గించారా..?
By: Tupaki Desk | 21 July 2022 4:25 AM GMTఎంత మంచి సినిమా చేసినా అది థియేటర్ లో బిగ్ స్క్రీన్ మీద చూసే ఆడియన్ కి బోర్ కొట్టకుండా ఆకట్టుకునే కథనంతో సీట్లో కూర్చో బెట్టాల్సి ఉంటుంది. ఇదే ప్రతీ ఫిలిం మేకర్ కు సవాలుతో కూడుకున్న పని. అందులోనూ ఇప్పుడు ఓటీటీలకు అలవాటు పడిపోయిన జనాలు.. కంటెంట్ కాస్త బోరింగ్ గా అనిపిస్తే వెంటనే స్కిప్ చేస్తున్నారు. కానీ థియేటర్ లో ఆ అవకాశం ఉండదు కాబట్టి బయటకు వచ్చేస్తున్నారు. అందుకే సినిమా నిడివి మీద కూడా మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న "థాంక్యూ" సినిమా పూర్తి నిడివి గం. 2.09 నిమిషాలు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఫైనల్ లెన్త్ ను అంత వరకూ తీసుకురావడానికి చాలా సీన్లకు కత్తెర వేశారనే రూమర్స్ వచ్చాయి. నిర్మాత నిర్ణయంతోనే నిడివి అంత తగ్గించారని.. దీంతో క్రియేటివ్ టీమ్ కలత చెందారని ఊహాగానాలు వచ్చాయి.
అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' సినిమా తెరకెక్కింది. దీనికి బీవీఎస్ రవి కథను అందించగా.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా నిడివి రెండున్నర గంటలకు పైగానే వచ్చిందని.. అంతసేపు ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టడం కష్టమని భావించి దిల్ రాజు చాలా వరకు కటింగ్స్ సూచించి రన్ టైం తగ్గించారని టాక్ వచ్చింది.
ఇటీవల కొన్ని సినిమాలు లెంగ్త్ కారణంగా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే 'థాంక్యూ' సినిమాలోని చాలా భాగాన్ని ట్రిమ్ చేశారని.. కాకపోతే దిల్ రాజు ఏకపక్ష నిర్ణయం వల్ల విక్రమ్ కుమార్ మరియు బీవీఎస్ రవి కలవరపడ్డారని వార్తలు వచ్చాయి. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
శుక్రవారం (జులై 22) 'థాంక్యూ' విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సినిమా నిడివి తగ్గించారనే రూమర్స్ పై ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని దర్శకుడు విక్రమ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. లెన్త్ అంత ఎక్కువేమీ రాలేదని.. ఫైనల్ ఎడిటి చేసిన తర్వాత ఎంత లెన్త్ అయితే వచ్చిందో అంతే ఉంచామని తెలిపారు.
"మేము ఎలాంటి ఎపిసోడ్ ని కానీ సీన్స్ ని కానీ తొలగించలేదు.. పేపర్ మీద ఏమైతే రాశామో అన్ని సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి. వంద శాతం నేను సంతృప్తికరంగా ఉన్నాను" అని విక్రమ్ చెప్పారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. "షూటింగ్ 85 రోజులు మాత్రమే జరిగింది. దానికి తగ్గట్టే లెన్త్ వచ్చింది. ఎక్కువ డేస్ షూటింగ్ లేనప్పుడు లెన్త్ ఎక్కువ రాదు" అని అన్నారు.
"ఇది టీమ్ వర్క్. 'థాంక్యూ' సినిమా జరిగిన ఈ మూడేళ్ళలో విక్రమ్ తో నా జర్నీలో ఎలాంటి గ్యాప్ రాలేదు. సినిమా విషయంలో ఒకటీ రెండు విషయాల్లో అభిప్రాయ బేధాలు వచ్చి ఉండొచ్చు అంతే. బయటి వాళ్లకు ఏమి అర్థమైందో తెలియదు కానీ.. ఆల్మోస్ట్ 90 శాతం నాకు మ్యాచ్ అయ్యాడు. విక్రమ్ గ్రేట్ పర్సన్" అని దిల్ రాజు తెలిపారు.
ఇకపోతే 'థాంక్యూ' సినిమాలో నాగచైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ గా కనిపించనున్నారు. అయితే నిడివి తగ్గించే క్రమంలో 'పోకిరి' రెఫరెన్స్ గా తీసుకున్న థియేటర్ ఫైట్ సీన్ మరియు కాలేజ్ సీన్స్ కొన్ని కట్ చేశారని రూమర్స్ వచ్చాయి. దీనిపై రైటర్ బీవీఎస్ రవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
"ఎలాంటి సీన్స్ తొలగించబడలేదు. ఎందుకంటే అలాంటి షూట్ చేయలేదు కాబట్టి.. మొదట అసలు అలాంటి సన్నివేశాలను రాయలేదు కనుక. రన్ టైమ్ ఎంత అవసరమో సరిగ్గా అంతే వచ్చింది" అని బీవీఎస్ రవి ట్వీట్ చేశారు. 'థాంక్యూ' సినిమాలో మహేష్ బాబు నటించిన మూడు క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ 'ఒక్కడు' 'పోకిరి' 'దూకుడు' రెఫరెన్స్ ఉంటాయని స్పష్టత ఇచ్చారు.