Begin typing your search above and press return to search.

పుష్ప రష్యన్ ట్రైలర్ చూశారా... నిజంగా మైండ్ బ్లోయింగ్

By:  Tupaki Desk   |   29 Nov 2022 6:18 AM GMT
పుష్ప రష్యన్ ట్రైలర్ చూశారా... నిజంగా మైండ్ బ్లోయింగ్
X
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొంది గత ఏడాది డిసెంబర్ లో విడుదల అయిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తెలుగు లో మాత్రమే ఈ సినిమా ఆడుతుందని చిత్ర యూనిట్‌ సభ్యుల వారు కూడా భావించారు. కానీ హిందీలో ఈ సినిమా సైలెంట్ గా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

పుష్ప సినిమా వంద కోట్ల వసూళ్లను కేవలం బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద రాబట్టిన విషయం తెల్సిందే. పుష్ప మొత్తంగా 400 కోట్ల వసూళ్లు సాధించింది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. పుష్ప సినిమా విడుదల అయ్యి ఏడాది కాబోతున్న ఈ సమయంలో రష్యన్‌ భాష లో విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు.

రష్యా లో ఇండియన్ సినిమా లు స్థానిక భాషలో విడుదల అవ్వడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఈ సినిమా ను రష్యన్ లాంగ్వేజ్ లో విడుదల చేసేందుకు సిద్ధం చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ బాలీవుడ్‌ వర్గాల వారు కూడా మాట్లాడుకుంటున్నారు.

ఇండస్ట్రీ హిట్‌ సొంతం చేసుకున్న ఎన్నో సినిమాలను పక్కన పెట్టి పుష్ప సినిమాను రష్యన్‌ లాంగ్వేజ్ లో విడుదల చేసేందుకు సిద్ధం అవ్వడం చూస్తూ ఉంటేనే కచ్చితంగా ఈ సినిమా పై యూనిట్‌ సభ్యులకు బాగా నమ్మకం ఉంది.. ఆ నమ్మకం కు తగ్గట్లుగా ఈ సినిమా ఆడుతుందని అంటున్నారు.

రష్యా లో పుష్ప సినిమా కు మంచి ప్రమోషన్ చేస్తూ విడుదల చేయబోతున్నారు. డిసెంబర్‌ 8వ తారీకున ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా నమ్మకంతో పుష్ప రష్యన్‌ లాంగ్వేజ్ రిలీజ్ కోసం మరియు అక్కడ రాబోతున్న స్పందన కోసం వెయిట్‌ చేస్తున్నారు.

పుష్ప సినిమా రష్యా లో విజయాన్ని సొంతం చేసుకుంటే కచ్చితంగా భవిష్యత్తు పూర్తిగా మారుతుందనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. బన్నీకి జోడీగా ఈ సినిమా లో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా నటించిన విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా యొక్క రెండవ పార్ట్‌ చిత్రీకరణ మొదలు అయ్యిందని.. వచ్చే ఏడాది చివర్లో పుష్ప 2 వస్తుందని యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.