Begin typing your search above and press return to search.

సెకండ్ జ‌న‌రేష‌న్ స‌న్నీలియోన్ ని చూశారా?

By:  Tupaki Desk   |   11 Jan 2023 11:30 PM GMT
సెకండ్ జ‌న‌రేష‌న్ స‌న్నీలియోన్ ని చూశారా?
X
అవ్ నీత్ కౌర్ (21) సోషల్ మీడియా ఫ్యాష‌నిస్టాగా సుప‌రిచితం. త‌న ఆకర్షణీయమైన ఫోటోలు వీడియోలను ఇన్ స్టాలో రెగ్యుల‌ర్ గా పోస్ట్ చేస్తూ నెటిజ‌నుల‌ను ఆక‌ర్షిస్తోంది. ఇప్ప‌టికే త‌న‌కు ఇన్ స్టా వేదిక‌గా భారీ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. 'అలీ బాబా: దస్తాన్-ఎ-కాబూల్' షోలో దివంగత తునీషా శర్మ స్థానంలో న‌టించేందుకు ఎంపికై ఇటీవల వార్తల్లో నిలిచింది. ఈ ఎంపిక త‌ర్వాత‌ వరుస గా హాటెస్ట్ స్నాప్ లను షేర్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచింది.

వీటిలో కొన్ని ఫోటోలు నెటిజనుల్లోని ఒక వర్గానికి న‌చ్చ‌లేదు. దీంతో నెగెటివ్ కామెంట్లు వినిపించాయి. ఒక నెటిజ‌న్ 'రెండోత‌రం స‌న్నీలియోన్' అంటూ కించ‌ప‌రిచాడు. మరొకరు 'ఉర్ఫీ జావేద్ స్ఫూర్తితో' అని వ్యాఖ్యానించారు. అయితే కొంద‌రు అభిమానులు అవ్ నీత‌పై ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. అవ్ నీత్ కి ప్రేమ బానిస‌లం అని కూడా కొంద‌రు సోష‌ల్ మీడియాల్లో వెంబ‌డిస్తున్నారు.

నిజానికి అవ్ నీత్ చూడ‌టానికి పక్కింటి అమ్మాయి లా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో హాటెస్ట్ ఫోటోషూట్ ని షేర్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బ్లాక్ మోనోకినిలో సంథింగ్ స్పెషాలిటీ ఉన్న‌ ఫ్యాషనిష్టాగా మారిన అవనీత్ ఎంతో గ్లామ‌ర‌స్ గా క‌నిపిస్తోంది. మోనోకిని లుక్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోల‌ను అవ్ నీత్ సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది. ప్ర‌స్తుతం అవి వైర‌ల్ గా మారుతున్నాయి.

తాజాగా స్విమ్మింగ్ పూల్ లో మోనోకిలో క‌నిపించ‌గా.. బ్లాక్ షేడ్స్ క‌ళ్ల‌ద్దాల‌తో సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. అవ్ నీత్ కౌర్ ఇటీవ‌ల‌ తన వ్యక్తిగత ఫ్యాష‌న్ శైలిని రూపాన్ని కూడా మార్చుకుంది. స‌హ‌జంగా ఉన్నా కానీ ఆకర్షణీయంగా క‌నిపించేందుకు అవ్ నీత్ ప్ర‌య‌త్నిస్తోంది. అప్పుడ‌ప్పుడు హాటెస్ట్‌ ఫోటోషూట్ల‌తో దుమారం రేపుతోంది. టికు వెడ్స్ షేరుతో బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్న ఈ బ్యూటీ మునుముందు హిందీ ప‌రిశ్ర‌మ‌తో పాటు ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ న‌టించేందుకు రంగం సిద్ధం చేస్తోంద‌ని స‌మాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.