Begin typing your search above and press return to search.
బాపు బొమ్మ స్నేహ వారసుల్ని చూశారా?
By: Tupaki Desk | 26 Jan 2021 7:01 AM GMTబాపు బొమ్మగా తెలుగు నాట పాపులరైంది స్నేహ. బాపు దర్శకత్వం వహించిన రాధా గోపాళం చిత్రంలోనూ నాయికగా నటించింది. ఇందులో శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ సరసన స్నేహ నటించింది. సౌత్ లో స్నేహ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే సాటి నటుడు ప్రసన్నను ప్రేమించి పెళ్లాడారు. ఈ జంటకు ముచ్చటగా ఇద్దరు. ఆ ఇద్దరు చిన్నారులు పెరిగి పెద్దవాళ్లవుతున్నారు.
ప్రసన్న - స్నేహ జంట కుమార్తె ఆద్యంత ఒకటవ పుట్టినరోజు పార్టీ వీడియో తాజాగా అంతర్జాలంలో వైరల్ అవుతోంది. ఈ జంటకు విహాన్ అనే 4 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఆగస్టులో ప్రసన్న 38 వ పుట్టినరోజు సందర్భంగా భార్య స్నేహ ఇన్ స్టాలో తమ కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేసారు. ఈ జంట తమ రెండవ బిడ్డగా ఆడ శిశువును 24 జనవరి 2020 న స్వాగతించారు. లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు ఏడాది చిన్నారి. తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఘనంగా పుట్టినరోజు వేడుకను నిర్వహించారు.
కుమార్తె మొదటి పుట్టినరోజు పార్టీ నుండి వీడియోని స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్నేహ శిశువును తన చేతుల్లో పట్టుకొని కేక్ కట్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఆకట్టుకుంది.
స్నేహ-ప్రసన్న లవ్ స్టోరి గురించి తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలి. `అచ్చముండు` అనే తమిళ సినిమా సెట్స్ లో ఈ జంట ఒకరినొకరు కలిశారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డాడు. 2012 లో పెళ్లితో ఒకటయ్యారు. ఇప్పుడు ఇద్దరు పిల్లల గర్వించదగిన తల్లిదండ్రులు అయ్యారు.