Begin typing your search above and press return to search.
#HBD నారా రోహిత్ స్ట్రైక్స్ ఎగైన్.. ఈసారి కొత్త లుక్ తో!
By: Tupaki Desk | 25 July 2021 5:37 AM GMT`బాణం` లాంటి ప్రయోగాత్మక చిత్రంతో కెరీర్ ని ప్రారంభించిన నారా రోహిత్ ఆ తర్వాత కూడా అతడు ప్రయోగాల బాటను అనుసరించిన సంగతి తెలిసిందే. నటనలో డైనమిజం ఉన్న హీరో అని తొలి సినిమాతోనే ప్రూవైంది. సోలో చిత్రంలో లవర్ బోయ్ గా ఎమోషన్ ఉన్న పాత్రతో మైమరిపించిన రోహిత్... రౌడీ ఫెలో చిత్రంలో మాసీ నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు. కెరీర్ లో కొన్ని ఫ్లాపులు ఒడిదుడుకులు ఉన్నా తనదైన శైలిలో విలక్షణమైన స్క్రిప్టులను ఎంచుకునేందుకు వెనకాడలేదు.
కొంత గ్యాప్ తర్వాత ఇటీవల తన లుక్ ని మార్చుకుని కొత్త తరహా చిత్రానికి సిద్ధమయ్యారు. ఎలాగైనా మళ్లీ సూపర్ హిట్ ని దక్కించుకుని ట్రాక్ లోకి రావాలని ఇప్పటికే ఓ భారీ ప్రాజెక్ట్ ని ఎంపిక చేసుకున్నారని కథనాలొచ్చాయి. ఇటీవల సుకుమార్ `పుష్ప` చిత్రంలో విలన్ పాత్రను ఆఫర్ చేసినా తిరస్కరించారని ప్రచారమైన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం రోహిత్ స్మార్ట్ లుక్ తో తన అభిమానులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా అతడి కొత్త లుక్ అంతర్జాలంలో వైరల్ అవుతోంది. రోహిత్ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాల్లో శుభాకాంక్షలు తెలిపారు. గ్యాప్ వచ్చినా లేటెస్టుగా వస్తున్నా! అని అతడు సిగ్నల్స్ ఇస్తున్నాడు. తదుపరి తన సినిమాలపై రోహిత్ వివరాలందిస్తారనే అభిమానులు వెయిట్ చేస్తున్నారు.