Begin typing your search above and press return to search.
చిన్న సినిమాలు తీయనంటున్న చిన్న దర్శకుడు
By: Tupaki Desk | 7 Oct 2019 10:23 AM GMTఅందరూ చిన్న సినిమాలు తీయడానికి భయపడుతున్న రోజుల్లో 'ఈ రోజుల్లో' అనే చిన్న సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాడు. ఆ తర్వాత వరుసగా చిన్న సినిమాలు తీసి హిట్స్ కొడుతూ చిన్న సినిమాలకు రాజమౌళి లాంటి వాడు అని పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ మారుతి. మారుతి టాకీస్ అనే బ్యానర్ ను మొదలుపెట్టి నిర్మాతగా, దర్శకుడిగా సక్సెస్ ఫుల్ వెళ్తున్నాడు. మారుతి వరుస హిట్లతో ఉన్నపుడు ఇండస్ట్రీలో చాలామంది చిన్న సినిమా ప్రొడ్యూసర్లు తాము తీసిన సినిమాలను మారుతి బ్రాండ్ మీద విడుదల చేసేవారు. అతని పేరు, అతని సంస్థ పేరు వాడుకున్నందుకు అతనికి ప్రతిఫలం కూడా అందేది. రానురాను మారుతి అనే బ్రాండ్ కూడా పడిపోయింది. దీంతో ఈ చిన్న సినిమాల దర్శకుడు ఇప్పుడు తాను చిన్న సినిమాలు దర్శకత్వం చేయనని, ప్రొడ్యూసర్ గా కూడా చేయనని అంటున్నాడు.
చిన్న సినిమాలకైనా , పెద్ద సినెమాలకైనా కష్టం ఒకటేనని కానీ చిన్న సినిమా పొతే తనపై ప్రభావం ఎక్కువ పడుతుందని అందుకే ఇకనుండి చిన్న సినిమాలు దూరంగా ఉందామనుకుంటున్నా అని మారుతి స్పష్టం చేశాడు. తీస్తే పెద్ద సినిమాలే తీస్తానని అంటున్నాడు. అది కూడా యువీ ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ లాంటి సంస్థలతో కలిసి మాత్రమే సినిమాలు తీస్తానని అన్నాడు.