Begin typing your search above and press return to search.

హీ ఈజ్ సో క్యూట్: మహేష్ ను టీజింగ్ చేస్తోందే

By:  Tupaki Desk   |   16 Dec 2019 12:19 PM GMT
హీ ఈజ్ సో క్యూట్: మహేష్ ను టీజింగ్ చేస్తోందే
X
వరస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు. భారీ అంచనాలు నడుమ ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే టీజర్.. రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసిన 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ తాజాగా మూడవ పాటను కూడా రిలీజ్ చేసింది.

ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. 'హీ ఈజ్ సో క్యూట్' అంటూ సాగే ఈ పాటకు సాహిత్యం అందించిన వారు శ్రీమణి. ఆలపించినవారు మధుప్రియ. హీరోను టీజింగ్ చేస్తూ హీరోయిన్ పాడే పాట. మహేష్ క్యూట్ గా ఉంటాడు కదా.. అందుకే రష్మిక మనసు పారేసుకుని "అబ్బబ్బబ్బబ్బ.. అబ్బాయెంతో ముద్దుగున్నాడే.. ఆకాశం అందేటంత ఎంత ఎంత ఎత్తుగున్నాడే.. అల్లాద్దిన్ దీపం నుంచి వచ్చాడనుకుంటా.. అల్లాడించాడే ఓరకంట.. పిల్లాడి బుగ్గ షిమ్లా యాపిల్ లాంటిదంట.. దొరకాలే గాని కొరికి తింటా" అంటూ ఎంతో సరదాగా.. అల్లరిపెడుతూ ఉంటుంది. లిరిక్స్ సూపర్ గా ఉన్నాయి. మధుప్రియ ఈ అల్లరి అంతా పాటలో ప్రతిబింబించేలా చక్కగా పాడింది.

మహేష్ ఒక అమాయకుడిలాగా అలా నడుస్తూ ఉండడం.. రష్మిక స్టెప్పులేస్తూ మహేష్ వెంటపడే విజువల్స్ బాగున్నాయి. ట్యూన్ విషయానికి వస్తే ఎనర్జిటిక్ గానే ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ రేంజ్ టాప్ క్లాస్ ట్యూన్ అని మాత్రం చెప్పలేం. అయితే ఈ పాట ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. ఆలస్యం ఎందుకు.. అందమైన మహేష్ ను.. అల్లరిపిల్ల రష్మిక.. రష్మిక అల్లరికి తోడుగా ఉన్న లేడీస్.. పిల్లల గ్యాంగును చూసేయండి.