Begin typing your search above and press return to search.
కపిల్ దేవ్ బయోపిక్.. శ్రీకాంత్ ఈయనే!
By: Tupaki Desk | 30 Jan 2019 6:35 AM GMT1983 ప్రపంచకప్ విక్టరీ మర్చిపోలేనిది. ది గ్రేట్ కెప్టెన్ కపిల్ దేవ్ సారథ్యంలో రాటు దేలిన టీమిండియాలో గవాస్కర్, రవిశాస్త్రి, శ్రీకాంత్ కృష్ణమాచారి, బల్విందర్ సింగ్ సంధు, సందీప్ పాటిల్, దిలీప్ వెంగ్ సర్కార్, రోజెర్ బెన్ని, మోహిందర్ అమర్ నాథ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ గ్రేట్ విక్టరీ నేపథ్యంలో కపిల్ దేవ్ జీవితకథపై 83 పేరుతో బాలీవుడ్‌లో ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.
టీమిండియా విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో ఎనర్జిటిక్ హీరో రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇతర కీలక పాత్రలకు ఎంపికలు జరుగుతున్నాయి. ఇటీవలే బల్వీందర్ సింగ్ సంధు పాత్రకు పంజాబీ నటుడు, గాయకుడు అమ్మీ విర్క్ ని ఎంపిక చేశారు. తాజాగా తమిళ హీరో జీవా ఓ కీలక పాత్రకు ఎంపికయ్యారు. ఆ మేరకు నిర్మాత మధు మంతెన వివరాల్ని అందించారు.
జీవా సౌత్ లో ప్రతిభావంతుడైన స్టార్. అతడు నటించిన కో (రంగం) చూశాక ఆ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నాం. కానీ కుదరలేదు. 83 సినిమాలో టీమిండియా కీలక ఆటగాడు శ్రీకాంత్ కృష్ణమాచార్య పాత్రకు జీవా ఎంపికయ్యాడు అని ఆయన తెలిపారు. జీవా తప్ప ఆ పాత్రకు వేరొకరిని పెద్ద తెరపై ఊహించలేనని ఆయన జీవాకి కితాబిచ్చారు. ఈ యంగ్ హీరోకి సౌత్ లో అసాధారణ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని మధు మంతెన వ్యాఖ్యానించారు. జీవా ప్రస్తుతం తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. రంగం తర్వాత తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా అభిమానుల్ని మాత్రం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. నార్త్ - సౌత్ స్టార్ల కలయికతో 83 చిత్రానికి దేశమంతా పాపులారిటీ పెంచే ప్రయత్నం సాగుతోందని అర్థమవుతోంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్టర్లు, టీజర్ కి చక్కని స్పందన లభించింది.