Begin typing your search above and press return to search.
‘వకీల్ సాబ్’ను కాపాడేది ఆయనొక్కడే!
By: Tupaki Desk | 7 April 2021 4:30 AM GMTపేపర్ ముక్కలను బస్తాల్లో సిద్ధం చేసుకున్నారు.. టపాసులు కూడా కొనుక్కున్నట్టే ఉన్నారు.. కానీ.. వాటిని విసిరి, వీటిని కాల్చే అవకాశం వస్తుందా? రాదా? అన్నదే ఇప్పుడు పవన్ అభిమానులను పట్టి పీడిస్తున్న విషయం! బెనిఫిట్ షోలకు థియేటర్లు సిద్ధం చేశారు.. ఎంత కలెక్ట్ అవుతుందో రాసిపెట్టుకున్నారు.. కానీ.. బొమ్మ పడుతుందా? లేదా? అన్నదే మేకర్స్ కు నిద్రపట్టనివ్వని అంశం!
వకీల్ సాబ్ రీ-ఎంట్రీకి ఇంకా రెండు రోజులు మాత్రమే టైమ్ ఉంది. ఈ వేడుకను అంబరాన్నంటే సంబరాలతో రచ్చ రచ్చ చేయాలని అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఇందుకోసం ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ.. బెనిఫిట్ షోలకు అనుమతి వస్తుందా? లేదా? అన్నదే సందేహం. పరీక్ష రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థుల మాదిరిగా ఉంది ఇప్పుడు ఫ్యాన్స్ కండీషన్.
సాధారణ రోజుల్లో అయితే.. ప్రభుత్వాలు ఇంతగా ఆలోచించేవే కావు. కానీ.. కరోనా మహమ్మారి రెండోసారి విజృంభిస్తుండడంతో ఆలోచించాల్సి వస్తోంది. పవన్ సినిమా అంటే.. మామూలుగానే ఫ్యాన్స్ రచ్చ చేస్తారు. అలాంటిది.. మూడేళ్ల తర్వాత వస్తుండడంతో వారి సెలబ్రేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించొచ్చు.
ఇటు సినిమా వ్యాపారులు కూడా ఇదే అంచనాలతో భారీగా డబ్బులు పెట్టి వకీల్ సాబ్ ను కొనేశారు. దాదాపు వంద కోట్ల మేర ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఇప్పుడు ఈ మొత్తం వెనక్కి తేవడం ఎలా అన్నదే పెద్ద టాస్క్. సినిమా టాక్ బయటకు వెళ్లే లోపే చాలా వరకు రాబట్టాలన్నది మేకర్స్ ప్లాన్. ఇందులో భాగంగానే బెనిఫిట్ షోలకు ప్లాన్ చేశారు.
ప్రధాన నగరాల్లో అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలు వేసేందుకు స్కెచ్ గీశారు. ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కానీ.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి మాత్రం ఇంకా అనుమతి రాలేదు. కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అదనపు షోలకు అనుమతి రాకపోవచ్చనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. కానీ.. మేకర్స్ మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రధాన నేతలను పట్టుకొని పని చేయించుకునే పనిలో ఉన్నారని కూడా అంటున్నారు.
అయితే.. దేశంలో ఒక రోజు కేసులు లక్షను దాటిపోయిన వేళ.. థియేటర్లను మళ్లీ 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపించాలని ఆదేశించినా ఆశ్చర్యం లేదంటున్నారు. దేశంలో పలు రాష్ట్రాలలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు కూడా. మరి, ఇలాంటి పరిస్థితుల్లో.. అదనపు షోలకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత మేరకు అవకాశం వస్తుందన్నదే ప్రశ్న.
అనుమతి వస్తే అభిమానులు, మేకర్స్ హ్యాపీ. రాకపోతేనే సమస్య. కొవిడ్ సెకండ్ వేవ్ వేళ.. వందకోట్లు సాధించడం అనేది సాధారణ విషయం కాదు. అదే సమయంలో.. వందకోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. దాన్ని కలెక్ట్ చేయడం మాత్రం అత్యవసరం. ఇలాంటి ఈ కండీషన్లో వకీల్ సాబ్ ను కాపాడగలిగేది ఆయనొక్కడే. ఆయన మరెవరో కాదు.. పవర్ స్టార్ మాత్రమే! అవును.. ఈ కష్టకాలంలో పవన్ క్రేజ్ తోనే సినిమా కలెక్షన్లు రాబట్టాల్సి ఉంది. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.