Begin typing your search above and press return to search.
మహేష్ ని ఎక్కువ పవన్ ని తక్కువ చేశాడా?
By: Tupaki Desk | 1 Feb 2022 6:30 AM GMTదర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడం చాలా సమీకరణాల్ని మార్చేసింది. నిజానికి సంక్రాంతి 2022 కోసం తొలిగా పోటీకి దిగింది పవన్ కల్యాణ్.. మహేష్‌బాబు. పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ .. మహేష్ నటిస్తున్న సర్కార్ వారి పాట సంక్రాంతి బరిలో రావాల్సినవే. అయితే సడెన్ గా ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి రేసులోకి ప్రవేశించడంతో అయిష్టంగానే భీమ్లా నాయక్ టీమ్ రిలీజ్ వాయిదాకి అంగీకరించాయి. సంక్రాంతి రేసును విడిచిపెట్టడం త్రివిక్రమ్ కి చినబాబు వంశీకి ఇష్టం లేదని కూడా టాక్ వినిపించింది. కానీ పంపిణీదారుడు అయిన దిల్ రాజు పట్టుబట్ట మరీ భీమ్లా నాయక్ రిలీజ్ ని వాయిదా వేయించారు.
ఇక సూపర్ స్టార్ మహేష్ తన దర్శకుడు రాజమౌళి కోసం సర్కార్ వారి పాట వాయిదాకు వెంటనే అంగీకరించారు. దీంతో జక్కన్న ట్వీట్ చేస్తూ తన హీరో మహేష్ నిర్ణయాన్ని విపరీతంగా పొగిడేశారు. మహేష్ బాబు మంచి నిర్ణయంతో చొరవ తీసుకొన్నారు. సర్కారు వారి పాట నిజానికి సంక్రాంతి సినిమా. కానీ RRR కోసం తన సినిమాను వేసవికి వాయిదా వేస్తూ పరిశ్రమలో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశారని.. అందుకు నా హీరో మహేష్ కు థ్యాంక్స్ అని రాజమౌళి ట్వీట్ చేశారు.
ఆ తర్వాత సంక్రాంతి పోటీ నుంచి భీమ్లా నాయక్ కూడా సైడివ్వగా.. చాలా సింపుల్ ట్వీట్ తో రాజమౌళి లైట్ తీస్కున్నారు. పవన్ కల్యాణ్.. చిన్నబాబును ఉద్దేశించి ``వాయిదా వేసుకొన్నందుకు నిర్మాత హీరోలను అభినందిస్తున్నాను. భీమ్లా యూనిట్ కు అంతా శుభం జరగాలి!`` అని ట్వీట్ చేశారు. అయితే ప్రశంసించిన విధానంలోనే తేడా. మహేష్ ని కాస్త ఎక్కువ చేసి పవన్ ని తగ్గించారని జక్కన్నపై పవన్ అభిమానులు సీరియస్ అయ్యారు. ఇప్పుడున్న క్రైసిస్ లో ఎంతో రిస్క్ చేసి ఆర్.ఆర్.ఆర్ కోసం భీమ్లా నాయక్ విడుదల తేదీని వాయిదా వేసుకున్నారనేది అభిమానులు వాదన.
ఇకపోతే ఆర్.ఆర్.ఆర్ ని మార్చి 25న విడుదల చేస్తున్నామని రాజమౌళి తాజా ప్రకటనలో క్లారిటీ ఇవ్వగా.. ఏప్రిల్ 1 కానీ లేదా ఫిబ్రవరి 25న కానీ వస్తుందని భీమ్లా నాయక్ నిర్మాతలు వెంటనే క్లారిటీనిచ్చారు. ఏప్రిల్ 1న భీమ్లా వస్తే ఆర్.ఆర్.ఆర్ కి అది ముప్పే. భీమ్లా హైప్ నేపథ్యంలో అప్పటికి కలెక్షన్లకు గండి పడుతుంది. దీనర్థం పాన్ ఇండియా సినిమాతో పోటీకి భీమ్లా సిద్ధం అనే అనుకోవాలి. కానీ భీమ్లా నాయక్ బృందం ఏ రిలీజ్ తేదీకి ఫిక్సవుతుందో వేచి చూడాలి. భీమ్లా ఫిబ్రవరిలోనే వచ్చేస్తే ఇక ఏ గొడవా లేదని భావిస్తున్నారు.