Begin typing your search above and press return to search.
పద్మాలంటని గండుతుమ్మెద!!
By: Tupaki Desk | 23 Dec 2022 9:34 AM GMTఔను! తెలుగు సినీ ప్రస్తానంలో హీరోగా.. తొలినాళ్లలో అలరించిన కైకాల సత్యనారాయణ తర్వాత.. క్యారెక్టర్ నటుడిగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. సుమారు 800 సినిమాల్లో నటించిన కైకాల.. నభూతో నభవిష్యతి.. అనే రీతిలో తెలుగు తెరకు వన్నెతెచ్చారు. తను పోషించే పాత్రలకు న్యాయం చేశారు. అయితే.. సత్యనారాయణ ఎప్పుడూ.. అవార్డుల కోసం ఎదురు చూడలేదు.
రాజకీయంగా ఆయనకు అనేక మందితో పరిచయం ఉన్నప్పటికీ.. పార్టీల అధినేతలతో ఆయనకు సత్సం బంధాలు ఉన్పప్పటికీ.. ఏనాడూ.. నాకు అది లేదు.. ఇది కావాలి.. అని వారిని అడిగింది లేదు. బహుశ అందుకేనేమో.. ఎన్నో విభిన్నమైన పాత్రలు ధించినా.. కైకాల వంటి గండుతుమ్మెదకు.. పద్మాలు దక్కలే దు. కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు ఆయన దరి చేరలేదు.
అయినప్పటికీ..కైకాల ఏనాడూ.. బాధపడలేదు. ఒకసారి విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న రామనామక్షేత్రంలో కైకాలకు సన్మానం జరిగింది. దీనికి పెద్దగా ప్రచారం లేదు. నిజానికి వందమంది వస్తే.. నిండిపోయే ప్రాంగణం ఇది. ఇక్కడ సన్మానం చేసేందుకు నిర్వాహకులు ముందుకు వచ్చినా.. నిజానికి సత్యనారాయణ స్థాయికి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అంత ప్రాంగణమైనా కావాలి.
కానీ, కైకాల.. ఇవేవీ ఆలోచించలేదు. తన సభకు ఎంత మంది వస్తారు? తనకు ఏమిస్తారు? ఎంత మంది తనను ఆలింగనం చేసుకుంటారు. ప్రాంగణం పెద్దదా చిన్నదా..? అని చూడలేదు. వారు కోరారు.. నేను వెళ్తున్నాను.. అంటూ ఆయన విజయవాడకు వచ్చారు. ఆ సభలోనే ఆయనకు అప్పటి మేయర్.. జంధ్యాల గండపెండేరం తొడిగి.. పౌరసత్కారం చేశారు. ఇదీ.. సత్యనారాయణ అంటే.. అందుకే ఆయన పద్మాలంటని గండుతుమ్మెద అయినా.. ప్రేక్షకుల గుండెల్లో 'యముండ'గా మిగిలిపోయారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.