Begin typing your search above and press return to search.
'ఉప్పెన' కోసం కెరీర్ ను పణంగా పెట్టాడు.. నేనైతే చేసే వాణ్ణికాదుః నాగబాబు
By: Tupaki Desk | 13 Feb 2021 11:30 AM GMTవైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ 'ఉప్పెన' థియేటర్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. క్లైమాక్స్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా సినిమాపై పాజిటివ్ ఇంప్రెషనే పడింది. ముఖ్యంగా ఆ ముగ్గురి గురించే మట్లాడుకుంటున్నారు ఆడియన్స్. తెరపైన హీరో, హీరోయిన్ నటన.. తెరవెనక దర్శకుడి పనితనంపై ఓ రేంజ్ లో డిస్కషన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఉప్పెన పై మెగా బ్రదర్ నాగబాబు తన రివ్యూ చెప్పారు. మరి, ఆయన కోణం ఏంటో.. ఆయన మాటల్లోనే చూద్దాం..
'ఉప్పెన సినిమా చూశాను. ఈ సినిమా చూసిన తర్వాత నాలో చాలా ఫీలింగ్స్ కలిగాయి. ముందుగా.. ఈ రిస్క్ కంటెంట్‌ను ఒడ్డుకు చేర్చినందుకు మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్ ను అభినందిస్తున్నాను. కోట్ల రూపాయలతో కూడిన వ్యవహారాన్ని వారు ధైర్యంగా భుజాన మోసినందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. నేనే గనక ఈ సినిమా నిర్మించాల్సి వస్తే.. చేసే వాణ్ని కాదు. రిస్క్ అంటే డూ ఆర్ డై. అది నేను చేయను.
తొలి సినిమాలోనే వైష్ణవ్ ఇలాంటి సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడు. అందులోనే వాడి ధైర్యం ఉంది. ఇంత రిస్క్ కంటెంట్‌ను ఒప్పుకోవడమే పెద్ద రిస్క్. అలాంటి సినిమాను చేయడమే కాకుండా.. అందరితో ఒప్పించాడు. ఈ కథను తొలి సినిమాగా చేయాలా వద్దా? అని నన్ను అడిగితే.. నేనైతే అంగీకరించే వాడిని కాదు. వైష్ణవ్‌కు మున్ముందు ఇంకా సూపర్‌హిట్లు రావొచ్చు. కానీ.. ఇంత రిస్క్ ఉన్న సినిమా మాత్రం రాకపోవచ్చు. మెగా వారసత్వాన్ని కాకుండా.. సినిమాలో అశీర్వాదం క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా నటించాడు.
ఇక, ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి ఫెర్ఫార్మెన్ అన్ బిలివబుల్. ఆయన హాలీవుడ్ రేంజ్ ఫెర్ఫార్మర్. అతడి సినిమాలు చాలా చూశాను. పిజ్జా సినిమా చూసినప్పుడే ఏంటీ ఇలా చేస్తున్నాడు? అనే ఫీలింగ్ కలిగింది. మళ్లీ చూసినప్పుడు అర్థమైంది. ఆయన తనలోని నటుడిని కాకుండా క్యారెక్టర్‌ను ఎలివేట్ చేస్తున్నాడని! క్యారెక్టర్‌కు ఎంత కావాలో అంతే చేస్తాడు సేతుపతి.
ఇది డైరెక్టర్ బుచ్చిబాబు కథ. ఆయన పుట్టిపెరిగిన ప్రాంతం గురించి గొప్ప చూపించాలని అనుకున్నాడేమో. కానీ.. ఇలాంటి కథను సినిమాకు ఎంచుకోవడం అంటే.. ఖచ్చితంగా కెరీర్‌ను పణంగా పెట్టడమే. చావోరేవో తేల్చుకోవాల్సి ఉంటుంది. అలాంటి కథను అద్భుతంగా హ్యాండిల్ చేశాడు.'' అని చెప్పుకొచ్చారు నాగబాబు.