Begin typing your search above and press return to search.

టీవీ పగిలింది.. ఇలా అయితే సోనూసూద్‌ ఆఫర్లు కష్టమే!

By:  Tupaki Desk   |   14 July 2021 2:30 PM GMT
టీవీ పగిలింది.. ఇలా అయితే సోనూసూద్‌ ఆఫర్లు కష్టమే!
X
గత ఏడాది ఆరంభం నుండి సోషల్‌ మీడియాలో కంటిన్యూస్ గా సోనూసూద్‌ పేరు మారు మ్రోగుతూనే ఉంది. సోషల్‌ మీడియాతో పాటు గూగుల్ సెర్చ్ లో కూడా సోనూసూద్‌ ను గురించి చూసిన వారు చాలా మందే ఉన్నారు. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు సోనూ సూద్‌ చేసిన మంచి పనులకు మంత్ర ముగ్దులు అయ్యారు. సోనూసూద్‌ చేసిన మంచి పనుల గురించి టీవీలో పదే పదే చెప్పడం వల్ల ఆయన అంటే చిన్న పిల్లలో కూడా క్రేజ్‌ ఏర్పడింది. సోనూ సూద్‌ ను ఒక దేవుడు అన్నట్లుగా పిల్లలకు కూడా వారి తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. అంతటి క్రేజ్ ను దక్కించుకున్న సోనూ సూద్‌ ను టీవీలో ఒక హీరో కొడుతూ ఉంటే ఏడు సంవత్సరాల కుర్రాడు చూసి తట్టుకోలేక పోయాడు. దేవుడు వంటి సోనూసూద్‌ ను అలా కొడుతున్నాడు ఏంటీ అనే కోపంతో ఏకంగా ఆ టీవీనే బద్దలు కొట్టేశాడు.

సోనూసూద్‌ ను టీవీలో కొడితే చూడలేక పోయాను. అందుకే టీవీ పగుల కొట్టాను అంటూ ఆ ఏడు సంవత్సరాల పిల్లాడు అన్నాడు అంటే సోనూ సూద్ ను ఏ రేంజ్‌ లో జనాలు అభిమానిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సోనూ సూద్‌ మళ్లీ మళ్లీ టీవీలో విలన్ గా కనిపిస్తాడు. ఎందుకంటే ఆయన ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించాడు. ప్రస్తుతం కూడా ఆచార్య సినిమాలో విలన్‌ గానే నటిస్తున్నాడు. ఈ సినిమాలు వచ్చిన ప్రతి సమయంలో కూడా ఆయన అభిమానుల మనోభావాలు దెబ్బ తినే అవకాశం ఉంది. కనుక ఖచ్చితంగా ఆయన కు విలన్‌ గా ముందు ముందు ఆఫర్లు దక్కక పోవచ్చు అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

సోనూసూద్‌ హీరోగా సినిమాలు చేయాలని అభిమానులు అనుకుంటున్నారు. కాని ఆయన మాత్రం వచ్చిన ఆఫర్లను చేసేందుకు సిద్దం అంటున్నాడు. సోనూసూద్‌ విలన్‌ గా ముందు ముందు కనిపిస్తే ప్రేక్షకులు ఒప్పుకునే అవకాశాలు లేవనే ఉద్దేశ్యంతో నిర్మాతలు మరియు దర్శకులు ఆయన వద్దకు ఆఫర్‌ తీసుకుని వెళ్లక పోవచ్చు అంటున్నారు. పాజిటివ్‌ ఏదైనా ఉంటే అప్పుడు ఆయన వద్దకు వెళ్తారేమో. హీరోలు కూడా ఆయనతో పోరాటం చేసే సన్నివేశాల్లో ఇబ్బంది పడతారు. చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్‌ సమయంలో సోనూసూద్ ను తన్నేందుకు ఇబ్బంది పడ్డాడట. అందుకే ఫైట్‌ ను మార్చినట్లుగా కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. సోనూసూద్‌ ను ముందు ముందు విలన్‌ గా సినిమాల్లో తీసుకుంటే ఇలాంటి సమస్యలు వస్తాయి కనుక ఆయనకు ఆఫర్లు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.