Begin typing your search above and press return to search.
దళపతి ఇలయదళపతి ఇద్దరూ కావాలట!
By: Tupaki Desk | 12 Feb 2021 9:00 AM ISTగౌతమ్ మీనన్ విష్ లిస్ట్ లో ప్రముఖ హీరోలెవరెవరు? అంటే.. తాజాగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో ఓపెనయ్యారు. దళపతి విజయ్ ..తలైవా రజినీకాంత్.. విజయ్ సేతుపతిలతో కలిసి పనిచేయాలనుకుంటున్నానని అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన విష్ లిస్ట్ ని రివీల్ చేశారు.
``నేను ధ్రువ నట్చతిరమ్ (ధ్రువ నక్షత్రం) స్క్రిప్ట్ ను రజనీకాంత్ సార్ కు వివరించాను. సూపర్ స్టార్ స్క్రిప్ట్ ను ఇష్టపడ్డాడని అన్నారు. కానీ రకరకాల కారణాల వల్ల ఈ చిత్రం టేకాఫ్ కాలేదని నిర్మాత థాను సర్ నాకు సమాచారం ఇచ్చారు. వాస్తవానికి నేను ఒక పని చేస్తున్నానని మా అమ్మకు సమాచారం ఇవ్వాలి. అది రజినీ సార్ తో చిత్రం. రజినీని ఏదో ఒక రోజు కలుసుకుని తనతో కలిసి పనిచేస్తానని ఆశిస్తున్నా`` అని గౌతమ్ మీనన్ అన్నారు.
``సాధారణంగా నేను నా క్లైమాక్స్ ను ముందే రాయను. షూట్ సమయంలో ముగింపును ఖరారు చేయను. ఈ కారణంగానే `కాఖా కాఖా`లో నాతో పనిచేయడానికి విజయ్ నిరాకరించాడు. గత కొన్ని వారాలలో విజయ్ సన్నిహితులు నన్ను స్క్రిప్టు సిద్ధం చేయమని కోరారు. అతనికి ఈ స్క్రిప్ట్ తెలుసా లేదా అనేది నాకు తెలియదు. కానీ ఈ ఏడాది చివరి నాటికి ఆయనను కలవాలని త్వరలోనే సినిమా చేయాలని ఆశిస్తున్నాను. విజయ్ సేతుపతి నేను కోరుకునే మరో నటుడు. సేతుపతితో నా సంప్రదింపులు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి`` అని ఆయన చెప్పారు.
గౌతమ్ కూడా విజయ్ తో 'యోహన్ అధ్యాయం ఒండ్రు'ను చేయవలసి ఉంది. కానీ తెలియని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ వాయిదా పడిపోయింది. విజయ్-రజనీకాంత్- విజయ్ సేతుపతి వంటి స్టార్లతో గౌతమ్ మీనన్ సినిమా అంటే దాని రేంజే వేరుగా ఉంటుంది. కానీ ఆయన ఒక్కో సినిమా కోసం ఏళ్ల తరబడి టైమ్ వేస్ట్ చేస్తూ సాగతీయడమే ఇబ్బందికరం!! అన్న విమర్శలు ఉన్నాయి.