Begin typing your search above and press return to search.

ఒక్క షాట్ కోసం 17 సార్లు కారుతో గుద్దించుకున్నాడు

By:  Tupaki Desk   |   8 Feb 2022 11:30 AM GMT
ఒక్క షాట్ కోసం 17 సార్లు కారుతో గుద్దించుకున్నాడు
X
స్పైడర్‌ మ్యాన్‌ నో వే టు హోమ్‌ తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన న్యూ ఏజ్ స్పైడర్ మ్యాన్ టామ్ హాలాండ్ ఈ మధ్య తెగ వార్తల్లో నిలుస్తున్నారు. స్పైడర్ మ్యాన్ తాజా సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను దక్కించుకున్న ఈ హీరో వరల్డ్‌ సూపర్ స్టార్‌ గా నిలిచాడు. ప్రతి దేశంలో కూడా స్పైడర్ మ్యాన్‌ అద్బుతమైన వసూళ్లను దక్కించుకుంటుంది.

దాంతో ఇప్పుడు టామ్‌ హాలాండ్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. హాలీవుడ్ సినిమాల్లో వరుసగా నటిస్తున్న ఈయన ఒక్కో షాట్‌ పర్ఫెక్ట్‌ గా రావడం కోసం ఎంత కష్టమైన పడతాడట. ఈ విషయం స్పైడర్‌ మ్యాన్ నో వే టు హోమ్‌ సినిమా తోనే క్లారిటీ వచ్చింది. తాజాగా ఈయన నటించగా ఈనెల 18న విడుదల కాబోతున్న హాలీవుడ్‌ మూవీ అన్ చార్టెడ్‌ ఆ విషయాన్ని మరోసారి నిరూపించింది.

టామ్‌ హాలాండ్ ఆ సినిమాలోని ఒక షాట్ కోసం ఏకంగా 17 సార్లు కారుతో గుద్దించుకున్నాడట. ప్రతి సారి కూడా ఏదో ఒక చిన్న లోపం కారణంగా మళ్లీ మళ్లీ చేశారట. ఆ సమయంలో ఆయనకు గాయం అయినా కూడా పట్టించుకోకుండా 17 సార్లు రీ టేక్ లు చేశారట. సినిమాలో ఆయన పాత్ర స్పైడర్ మ్యాన్‌ గా ఉంటుందట. కనుక ఏ ఒక్క చిన్న తేడా రాకుండా అద్బుతంగా సినిమాలో ఉండాలనే ఉద్దేశ్యంతో కష్టం అయినా టేక్ ల మీద టేక్ లు తీసుకుని ఈ సన్నివేశంను టామ్‌ హాలండ్ చేసినట్లుగా హాలీవుడ్ మీడియా లో కథనాలు వస్తున్నాయి.

ప్రస్తుతం టామ్‌ హాలాండ్‌ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ కారణంగా అన్ చార్టెడ్‌ సినిమా ను భారీగా విడుదల చేస్తున్నారు. అద్బుతమైన వసూళ్లను ఈ సినిమా కూడా దక్కించుకుంటుందనే నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. సినిమాకు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలు మరో లెవల్‌ లో ఉంటాయని.. విజువల్‌ వండర్ గా సినిమాను మేకింగ్‌ చేశారని అంటున్నారను.

ఈ సినిమా లో టామ్‌ హాలాండ్ నటించడం వల్ల స్థాయి మరింతగా పెరిగిందని అంటున్నారు. 17 సార్లు కారుతో గుద్దించుకున్న ఆ సన్నివేశం ను సినిమాలో చూడాలని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకున్నా టామ్‌ హాలాండ్‌ సన్నివేశాలకు మంచి స్పందన రావడం ఖాయం అని ఆయన అభిమానులు అంటున్నారు.