Begin typing your search above and press return to search.

లింగమార్పిడి పాత్రలో రిస్క్ చేస్తున్న హార్ట్ ఎటాక్ బ్యూటీ!

By:  Tupaki Desk   |   20 Jun 2020 1:20 PM IST
లింగమార్పిడి పాత్రలో రిస్క్ చేస్తున్న హార్ట్ ఎటాక్ బ్యూటీ!
X
ఈ మధ్య బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక సినిమాలు బాగానే ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలా వీర్యదానం కాన్సెప్ట్ తో ‘విక్కీ డోనర్’మంచి హిట్ అయింది. ఇక తాజాగా లెస్బియన్ కథాంశంతో ‘ఏక్ లడకీకో దేఖాతో ఐసా లగా’ సినిమా విజయం సాధించింది. ఇప్పుడు ఏకంగా లింగమార్పిడి కథాంశంతోనే ఒక మూవీ తెరకెక్కుతోంది. ఆ సినిమానే ‘మ్యాన్ టు మ్యాన్’. ఈ సినిమాలో 'హార్ట్ ఎటాక్’ బ్యూటీ ఆదా శర్మ టైటిల్ రోల్ పోషిస్తుంది. 2008లోనే '1920' మూవీతో వెండితెరకు పరిచయం అయింది ఆదా. దాదాపు దశాబ్దం పైనే సినీరంగంలో రాణిస్తున్న ఈ భామ.. హిందీ.. తెలుగు.. కన్నడ.. తమిళ భాషల్లో గ్లామరస్ పాత్రలు మాత్రమే చేసింది. అభినయం పరంగా చాలా తక్కువ సినిమాలు చేసింది. అయితే ‘మ్యాన్ టు మ్యాన్’ చిత్రంతో తన కెరీర్ లోనే తొలిసారిగా ఛాలెంజింగ్ రోల్ చేస్తూ బాలీవుడ్‌లో చర్చనియాంశంగా మారింది.

అవుటాఫ్ ది బాక్స్ కాన్సెప్ట్‌తో ఇలా డేరింగ్ స్టెప్స్ వేస్తోన్న అదాశర్మ.. ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది. ఈ సినిమాలో పుట్టుకతో అబ్బాయి అయిన ఆదా శర్మ పాత్ర.. లింగమార్పిడి ఆపరేషన్ ద్వారా అమ్మాయిగా మారుతుందట. కానీ ఈ విషయం తెలియని హీరో నవీన్ కస్తూరియా అదాను పెళ్ళి చేసుకుంటాడట. పెళ్ళయిన తర్వాత ఆమె కథ తెలుసుకున్న భర్త ఖంగు తింటాడని సమాచారం. లింగమార్పిడి పై మన సమాజంలో ఉన్న చిన్నచూపు.. అలాంటి శస్త్రచికిత్స ద్వారా మారిన వ్యక్తులు ఎదుర్కొనే ఇబ్బందులను ఎంటర్టెయినింగ్‌గా చూపిస్తూ అదే సమయంలో అంతర్లీనంగా ఒక సోషల్ మెసేజ్ ఇస్తూ దర్శకుడు అబీర్ సేన్ గుప్తా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా గురించి ఆదా మాట్లాడుతూ.. "1920" నా మొదటి సినిమా. ఆ పాత్ర పోషించడం నాకు చాలా రిస్క్ అనిపించింది. రిస్క్‌లు తీసుకోవడం నాకు చాలా ఇష్టం. మేము 'కమాండో 2' చేసినప్పుడు అందులో భావన రెడ్డి పాత్ర కూడా కాస్త రిస్క్ అనిపించింది. ఎందుకంటే జోకులు వేస్తూ వెరైటీ యాసలో మాట్లాడాలి. అయితే నన్ను వారు 'కమాండో 3'లో కూడా భావన రెడ్డిగా కంటిన్యూ చేశారు. అందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇండియాలోని బెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజీలో కమాండో ఒకటి. ఇక ప్రస్తుతం చేస్తున్న మ్యాన్ టు మ్యాన్ కూడా రిస్క్ తో కూడుకున్న గొప్ప పాత్ర" అంటూ చెప్పుకొచ్చింది. మరి ‘మ్యాన్ టు మ్యాన్’ సినిమా అదా శర్మకు ఏ రేంజ్ ఫేమ్ తెచ్చిపెడుతుందో చూడాలి.