Begin typing your search above and press return to search.
షాకింగ్ సూసైడ్ నోట్: సుశాంత్ మృతిని తట్టుకోలేక దారుణం
By: Tupaki Desk | 17 Jun 2020 4:15 AM GMTబాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. సినీ అభిమానులను, సన్నిహితులను, కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఇప్పటికీ సుశాంత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
తాజాగా సుశాంత్ మరణం.. దాని తాలుకా దారుణాలను.., అతడికి జరిగిన అన్యాయాన్ని వార్తల ద్వారా తెలుసుకున్న అతడి అభిమాని ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది. ఆ అభిమాని రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు అందరి గుండెలను పిండిస్తోంది.
ఇప్పటికే ఇంతటి విపత్కర సమయంలో సుశాంత్ ఇంట్లో మరో విషాదం చోటుచేసుకున్నది. సుశాంత్ ఇక లేరనే విషయాన్ని తట్టుకోలేక అతడి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ.. అతడి వదిన, కజిన్ అమరేంద్రసింగ్ భార్య ఆకస్మికంగా మరణించింది. ఇప్పటికే విషాదంలో ఉన్న కుటుంబాన్ని మరింత దు:ఖంలోకి నెట్టింది.
తాజాగా ఉత్తరప్రదేశ్ లోని బరేలి గ్రామానికి చెందిన సుశాంత్ అభిమాని మరణించాడు. రెండు మూడు రోజులుగా సుశాంత్ మరణంతో తీవ్రవేదనకు గురైన పదోతరగతి చదువుతున్న బాలుడు ఆ బాధలోనే ఆత్మహత్య చేసుకొని తుదిశ్వాస విడిచాడు. బాలుడి మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది.
ఈ సందర్భంగా సుశాంత్ అభిమాని చనిపోతూ రాసిన సూసైడ్ నోట్ అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘సుశాంత్ చేసిన పని.. నేనెందుకు చేయకూడదు అంటూ’ తన సూసైడ్ లెటర్ లో పేర్కొనడం ప్రతీ ఒక్కరిని భావోద్వేగానికి గురిచేసింది.