Begin typing your search above and press return to search.

శ్రీదేవి త‌న పిల్ల‌ల్లో బాగా నింపింది

By:  Tupaki Desk   |   28 Feb 2018 4:09 PM GMT
శ్రీదేవి త‌న పిల్ల‌ల్లో బాగా నింపింది
X
శ్రీదేవి ఆక‌స్మిక మ‌ర‌ణం నుంచి లోకం తేరుకోలోక‌పోతోంది. తెర మీద మాత్ర‌మే చూసి ఆమెను ఆరాధించిన వాళ్లే ఇలా అయిపోతే... శ్రీదేవికి పుట్టిన పిల్ల‌లు ఇంతెలా కుంగిపోతారో. శ్రీదేవి భౌతిక కాయాన్ని క‌డ‌సారి చూసేందుకు ముంబైలో జ‌నాలు బారులు తీరారు. ఎంతో మంది బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా అందాల సుంద‌రికి తుది వీడ్కోలు ప‌లికారు. వారిలో సుస్మితాసేన్ కూడా ఉన్నారు.

సుస్మితకు ప‌ద్నాలుగేళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు... శ్రీదేవి వెండితెర‌పై వెలిగిపోతోంది. ఆమెనే రోల్ మోడ‌ల్‌గా భావించింది సుస్మిత‌. అలాంటి రోల్ మోడ‌ల్ క‌ళ్ల ముందు క‌నుమరుగైపోతే త‌ట్టుకోలేక‌పోయింది. శ్రీదేవి భౌతిక కాయాన్ని చూసేందుకు బారులు తీరిన వారిలో ఆమె కూడా ఒక‌రు. అనంత‌రం ఆమె త‌న సోష‌ల్ మాధ్య‌మంలో త‌న బాధ‌ను, శ్రీదేవి పిల్ల‌ల పెంప‌కాన్ని వ‌ర్ణించింది. త‌ల్లి భౌతిక కాయం ప‌క్క‌న ఆమె ఇద్ద‌రు కూతుళ్లు చాలా ధైర్యంగా నిల్చున్నార‌ని చెప్పింది. శ్రీదేవి త‌న పిల్ల‌ల్లో ధైర్యాన్ని నింపింద‌ని...అదే ఇప్పుడు వాళ్లు ప్ర‌దర్శిస్తున్నార‌ని కొనియాడింది. శ్రీదేవికి ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంది.

శ్రీదేవి త‌న కూతురును హీరోయిన్ గా చూడాల‌న్న కోరిక తీర్చుకోకుండానే క‌న్ను మూసింది. పెద్ద కూతురు జాన్వి ప్రస్తుతం ధ‌డ‌క్ సినిమాలో న‌టిస్తోంది. జూలైలో ఆ సినిమా విడుద‌ల కాబోతోంది. ఈ స‌మ‌యంలో కూతురుకు ఆ త‌ల్లి అండ చాలా అవ‌స‌రం. ఇక ఖుషీ ఇంకా త‌న కెరీర్ ఏంటో నిర్ణ‌యించుకోలేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆ పిల్ల‌ల‌కు త‌ల్లి దూర‌మ‌వ్వ‌డం నిజంగా దుర‌దృష్ట‌మే.