Begin typing your search above and press return to search.

లావణ్య ముందు ఆమె తేలిపోయిందా?

By:  Tupaki Desk   |   23 March 2017 7:22 AM GMT
లావణ్య ముందు ఆమె తేలిపోయిందా?
X
ఒక్కసారిగా కుమారి 21 ఎఫ్‌ సినిమాతో ఎక్కడలేని క్రేజ్ ను సొంతం చేసుకుంది హెబ్బా పటేల్. ఆ దెబ్బతో వరుసపెట్టి చాలా సినిమాలు వచ్చేశాయి. అందులోనూ వరుసగా ఈడోరకం ఆడోరకం.. ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సినిమాలు సక్సెస్ కావడంతో.. హెబ్బాకు తిరుగులేదు అనుకున్నారు. అయితే ఒక్కటైనా పెద్ద సినిమా పడేలోపే నేను నా బాయ్‌ ఫ్రెండ్స్ తో ఫ్లాపు పడిపోయింది. ఇప్పుడు అమ్మడు ''మిష్టర్''తో వస్తోంది.

తన కెరియర్ కు ఒక పెద్ద టిక్కెట్ ఈ మిష్టర్ సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాతో బ్రేక్ వస్తే వెంటనే పెద్ద పెద్ద హీరోలు ఈమెను సైన్ చేసే ఛాన్సుంటుంది. అయితే అటు ట్రైలర్లో ఇటు నిన్న ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్లో చూస్తే.. ఎందుకో మరో సెక్సీ బ్యూటి లావణ్య త్రిపాఠి ఈమెను ఓవర్ టేక్ చేసేస్తోందని అనిపిస్తోంది కదూ. పైగా హెబ్బా ట్రేడ్ మార్క్ఓవర్ యాక్షన్ లేకుండా సినిమా చేయడంతో ఈ సినిమాలోని పాత్ర పెద్దగా ఇంప్రెసివ్ గా కనిపించట్లేదు. అందుకే కళ్లన్నీ లావణ్య వైపే వెళ్లిపోతున్నాయ్.

ఈ సినిమాలో నేను చేసింది సెకండ్ హీరోయిన్ రోల్ కాదు.. ఒక ముఖ్యమైన మెయిన్ లీడ్ అంటూ హెబ్బా చెబుతోంది కాని.. ఒకవేళ ఏ మాత్రం రోల్ తేడా కొట్టేసినా కూడా మొత్తానికే మోసం వచ్చేస్తోంది. ఏప్రియల్ 14న మనకు అసలు మ్యాటర్ ఏంటో తెలుస్తుందిలే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/