Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: చీరలో బుజ్జిబుజ్జిగా కుమారి

By:  Tupaki Desk   |   7 April 2017 6:24 PM GMT
ఫోటో స్టోరి: చీరలో బుజ్జిబుజ్జిగా కుమారి
X
టాలీవుడ్ లో ముంబై భామ హెబ్బా పటేల్ రేంజే వేరు. ఇండస్ట్రీలోకి వచ్చి మూడేళ్లు దాటింది. ఇప్పటివరకూ ఏడు సినిమాలు నటించేసింది. ఈ ఏడాది మరో మూడు సినిమాలను రిలీజ్ కి రెడీ చేసేస్తోంది. ఈ పదింటిలో మూడు సినిమాలు హెబ్బానే లీడ్ గా తీసుకుని తీసేసిన మూవీస్ అంటే ఆశ్చర్యం వేయక మానదు.

ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ కి జోడీగా హెబ్బా పటేల్ నటించిన మిస్టర్ మూవీ రిలీజ్ అయిపోయింది. రీసెంట్ గా సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రానికి.. ప్రీరిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించారు. సాధారణంగా ఇలాంటి ఈవెంట్స్ కు హెబ్బా పటేల్ గ్లామరసం చిందిస్తూ హాజరవుతుంది కానీ.. మిస్టర్ ఫంక్షన్ కు మాత్రం కాసింత పద్ధతిగా వచ్చే ప్రయత్నం చేసింది. సినిమాలో ఎటూ గ్లామర్ రోల్ చేయడంతో.. స్టేజ్ పై కాసింత డిఫరెన్స్ చూపించింది. అయితే.. పెద్ద అంచు గల లేత రంగు చీర.. అందులోనూ పారదర్శకంగా పమిట చాటు నుంచి కనిపిస్తున్న అందాలు.. హెబ్బా పటేల్ అందాన్ని మరింతగా ఇనుమడింప చేసేశాయి.

మిస్టర్ మూవీలో హెబ్బా రెండో హీరోయిన్ పాత్ర పోషించినా.. గ్లామర్ తో ఓ రేంజ్ లో రెచ్చిపోయిందని టాక్. మిస్టర్ తర్వాత ఏంజెల్ అనే మూవీలోను.. అంధగాడులో రాజ్ తరుణ్ కి జోడీగాను హెబ్బా పటేల్ నటిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/