Begin typing your search above and press return to search.
హెబ్బా అబ్బ అనిపించేలా ఏంటబ్బా
By: Tupaki Desk | 13 May 2019 7:37 AM GMTవ్వావ్ .. వాటే మేకోవర్.. అయిపోతారంతే. ఈవిడను ఇలా చూశాక కుర్రాళ్లు ఆగుతారా? ఊహించని కొత్త లుక్ లోకి మారిపోయింది ఈ కుర్ర భామ. ఇంతకీ ఎవరీ భామ.. ? అంటే ఇంకెవరు కుమారి హెబ్బా పటేల్. ముంబై టు హైదరాబాద్ హెబ్బా జర్నీ గురించి తెలిసిందే. కుమారి 21 ఎఫ్.. నేను నాన్న బోయ్ ఫ్రెండ్ .. ఎక్కడికి పోతావు చిన్నవాడా? లాంటి సినిమాలతో ఆకట్టుకుంది హెబ్బా పటేల్. అయితే ఇటీవల సరైన హిట్టు అన్నది లేక కెరీర్ పరంగా చాలానే ఇబ్బంది పడుతోంది. 2014లో అధ్యక్ష అనే కన్నడ సినిమాలో నటించిన హెబ్బా పటేల్ అదే ఏడాది తెలుగు.. తమిళంలోనూ ప్రవేశించింది.
తెలుగులో ఆరంగేట్రమే కుమారి 21 ఎఫ్ చిత్రంలో జాక్ పాట్ తగిలింది. అసలు ఆ ఫేసేంటి? అన్నవాళ్లే అబ్బో కుమారి అంటే ఇలానే ఉండాలి అన్నారు. అంతగా ప్రభావం చూపిన ఈ అమ్మడు వరుసగా పలు క్రేజీ చిత్రాలకు సంతకాలు చేసింది. అగ్ర హీరోల సరసన ఛాన్సులు దక్కకపోయినా కుర్రహీరోలకు పెర్ఫెక్ట్ ఆప్షన్ గా హెబ్బా పటేల్ అవతరించింది. పరిశ్రమలో చకచకా ఈ నాలుగేళ్లలో డజను పైగానే సినిమాల్లో నటించి అబ్బుపరిచింది. మిస్టర్ .. అందగాడు.. ఏంజెల్.. 24 కిస్సెస్ ఇలా పలు చిత్రాల్లో నటించినా ఇవేవీ హిట్టవ్వకపోవడంతో కెరీర్ పరంగా తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వలేకపోతోంది.
ఆ క్రమంలోనే ఇదిగో ఇలా సామాజిక మాధ్యమాల్లో వేడి పెంచుతోంది. ఇటీవలే హలో మ్యాగజైన్ కవర్ షూట్ లో పాల్గొందని అర్థమవుతోంది. తాజాగా కొన్ని ఫోటోల్ని ఇన్ స్టాలో రివీల్ చేసింది. ఇందులో హెబ్బా షాకింగ్ మేకోవర్ మైమరిపిస్తోంది. అసలు హెబ్బాయేనా? మన కుమారియేనా? అన్నంతగా మారిపోయి కన్ఫ్యూజ్ చేస్తోంది. క్రిస్టల్ లెహంగా ధరించి.. ట్రెడిషనల్ వేర్ లోనూ నాభి సౌందర్యం ఎలివేట్ చేస్తూ యాబ్స్ ని ప్రదర్శిస్తూ.. టూ హాట్ గా కనిపించింది. తాను ఏం చేసినా టూ హాట్ అని చెప్పకనే చెబుతోంది. హెయిర్ స్టైల్ ని మెస్సీ డిజైన్ కి మార్చేసింది. అన్నట్టు .. ఇటీవలే ఇన్ స్టాలో హెబ్బా ఓ ప్రేమకపిత్వం తో విరుచుకుపడింది. ``నీ చేతుల్లో నన్ను టైట్ గా బంధించు.. రేయంతా నన్ను విడిచిపెట్టకు.. నా కలలన్నీ ప్రశాంతం .. ఎందుకంటే నీ వల్లనే.. నీ చేతుల్లోనే నన్ను బంధించు.. నీ పెదవులు ఎంత మధురమో.. వాటిని ముద్దాడాలన్నది నా కోరిక.. నా హృదయం నీకోసమే కొట్టుకుపోతోంది. నువ్వు ఎలా నన్ను బంధిస్తావో అలా నీ చేతుల్లోనే బంధించెయ్.. నేను నిన్ను ఎప్పుడు కలుస్తానో... అది నా ఫేట్. నేను ఒక సోల్ మేట్ ని కనుగొన్నాను.. `` అంటూ కవిత్వాన్ని ఒలకబోసింది. తనతో పాటు మరో అమ్మాయి ఫోటోని షేర్ చేసి పెద్ద ట్విస్టునే ఇచ్చింది హెబ్బా. అబ్బ అనిపించేలా.. ఏంటబ్బా.. ఈ ఊహించని షాకింగ్ ట్విస్టు?