Begin typing your search above and press return to search.

హెబ్బా.. తగ్గి చేస్తోందట!!

By:  Tupaki Desk   |   6 March 2018 6:36 AM GMT
హెబ్బా.. తగ్గి చేస్తోందట!!
X
కుమారి 21F సినిమాతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న బ్యూటీ హెబ్బా పటేల్. ఈ హీరోయిన్ మొదటి సినిమాతోనే యూత్ కి బాగా దగ్గరైన విషయం తెలిసిందే. దీంతో స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇవ్వడం గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. కానీ ఆ భామ అదృష్టం ఏమిటో గాని పెద్ద హీరోలతో అవకాశాలను అందుకోలేకపోయింది. రాజ్ తరుణ్ నుంచి వరుణ్ తేజ్ వంటి హీరోలతో చేసింది గాని ఎక్కువగా సక్సెస్ అందుకోలేదు.

ఇక గత ఏడాది వచ్చిన ఏంజెల్ సినిమా కూడా అమ్మడికి ఏ మాత్రం ఉపయోగపడలేదు. అయితే ఈ సారి మళ్లీ అదే హీరో అన్వేష్ తో జతకట్టడానికి హెబ్బా రెడీ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ తో ఎలాగైనా హిట్టు కొట్టి టాలీవుడ్ లో బిజీ అవ్వాలని అనుకుంటోంది. అయితే మొన్నటి వరకు ఈ భామ ఫిట్ నెస్ పై కొన్ని కామెంట్స్ గట్టిగా వచ్చాయి. మొదటి సినిమా తరువాత మెల్లగా లావెక్కుతోందని అందంలో తేడా వస్తోందని కామెంట్స్ వచ్చాయి.

దీంతో హెబ్బా ఫిట్ నెస్ పై ద్రుష్టి పెట్టి కొంచెం సన్నబడినట్లు తెలుస్తోంది. ఇక అన్వేష్ తో చేసే కొత్త సినిమా స్కై ఫై తరహాలో ఉంటుందట. గత కొంత కాలంగా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా అనే కన్ఫ్యూజన్ ఉండేది. కానీ రీసెంట్ గా నిర్మాత ఫైనల్ నిర్ణయాన్ని చెప్పడంతో త్వరలోనే సినిమా సెట్స్ పైకి రానుందట. చిత్ర నిర్మాత లండన్ గణేష్ మాట్లాడుతూ.. సినిమా స్క్రిప్ట్ చాలా బాగా సెట్ అయ్యిందని కథే ఇందులో అసలైన హీరో అంటున్నాడు. మరి ఈ సినిమాతో అయినా హెబ్బా బిజీ అవుతుంధో లేదో చూడాలి.