Begin typing your search above and press return to search.
ముద్దులే కాదు విషయం కూడా ఉందంటోంది
By: Tupaki Desk | 19 Nov 2018 11:24 AM GMTఈమద్య టాలీవుడ్ ను ముద్దుల సినిమాలు ముంచెత్తుతున్నాయి. ‘అర్జున్ రెడ్డి’ - ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రాలతో పాటు ఇంకా పలు చిన్న - మీడియం బడ్జెట్ చిత్రాల్లో ముద్దులకు ప్రముఖ స్థానం ఇస్తున్నారు. ముద్దు సీన్స్ వల్ల సినిమాలకు హైప్ రావడంతో పాటు మంచి ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం అందరిలో ఏర్పడినది. అందుకే ముద్దుల మీద ముద్దులు పెట్టుకునే సినిమాలు వరుసగా వస్తున్నాయి. అదే దారిలో ఇప్పుడు ‘24 కిస్సెస్’ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.
కుమారి 21ఎఫ్ చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ ఈ 24 ముద్దుల సినిమాలో హీరోయిన్ గా నటించింది. ‘మిణుగురులు’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు అయోధ్య కుమార్ ఇలాంటి చిత్రాన్ని తెరకెక్కించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఆ విమర్శలకు హెబ్బా చాలా రొటీన్ గా సమాధానం చెప్పింది. అంతా చెప్పినట్లుగానే తమ సినిమాలో ముద్దు సీన్స్ కథలో భాగమే కాని - తాము బలవంతంగా జొప్పించలేదు అంది.
ప్రస్తుతం ముద్దు సీన్ ల ట్రెండ్ నడుస్తుంది కనుక నువ్వు ఈ చిత్రంను చేస్తున్నావా అంటూ చాలా మంది నన్ను ప్రశ్నించారు. కాని నేను ఈ చిత్రం ఆర్ ఎక్స్ 100 - అర్జున్ రెడ్డి చిత్రాల కంటే ముందు నా వద్దకు వచ్చినా చేసేదాన్ని. ఎందుకంటే ఒక మంచి కథ ఈ చిత్రంలో ఉంది. టైటిల్ చూసి అంతా కూడా సినిమా గురించి ఒక అవగాహణకు వస్తారు. కాని సినిమా పూర్తి అయిన తర్వాత సర్ ప్రైజ్ అవుతారు అంది. మా చిత్రంలో కేవలం ముద్దులు మాత్రమే కాకుండా మంచి విషయాన్ని కూడా చెప్పాం అంటూ హెబ్బా పేర్కొంది. ఇది అంతా చెప్పే రొటీన్ విషయమే. హెబ్బా కూడా రొటీన్ గా అందరిలాగే చెప్పిందా లేదంటే నిజంగానే ఆమె చెప్పినట్లుగా సినిమాలో మ్యాటర్ ఉందో తెలియాలి అంటే సినిమా విడుదలవ్వాల్సిందే.