Begin typing your search above and press return to search.
హెబ్బా.. ఎంత బోల్డుగా మాట్లాడేసిందంటే..
By: Tupaki Desk | 2 May 2016 7:49 AM GMT‘అలా మొదలైంది’ సినిమాలో లంగావోణీల్లో చాలా పద్ధతిగా కనిపించింది హెబ్బా పటేల్. కానీ ఆమె ఎంత బోల్డో.. ఎంత హాటో.. ‘కుమారి 21 ఎఫ్’లో నటించాక కానీ తెలియలేదు. అలాంటి బోల్డ్ సినిమాలో నటించేసరికి.. హెబ్బా వ్యక్తిత్వంతో పాటు మాటతీరు కూడా మారిపోయినట్లుంది. ఎక్స్ పోజింగ్ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. ఎంత బోల్డ్ గా కనిపించమన్నా నేను రెడీ.. నన్ను హాట్ అండ్ సెక్సీ అంటే చాలా ఇష్టపడతాను.. అంటూ మరీ ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోందామె. తన తొలి రెండు సినిమాలు హిట్లయినా కూడా తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంపై స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.
‘‘నాకు ఎందుకు ఎక్కువ అవకాశాలు రావట్లేదో నాకు ఎప్పటికీ అర్థం కాని పజిల్. నా సినిమాలేవీ డిజాస్టర్లు కావు. బాగానే ఆడుతున్నాయి. నటన పరంగా కూడా మంచి మార్కులే పడుతున్నాయి. నేను ఎక్స్ పోజింగ్ కు వ్యతిరేకిని కాను. ఎంత బోల్డుగా కనిపించమన్నా అభ్యంతరం పెట్టను. కానీ నన్ను ఇంకా చిన్నపిల్లగానే చూస్తున్నారు తప్ప నాలోని గ్లామర్‌ని చూడడం లేదు. నన్ను హాట్ అండ్ సెక్సీ అని అంటేనే చాలా ఇష్టం. కానీ అన్నీ ఉన్నా.. అన్నట్లు తయారైంది నా పరిస్థితి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది హెబ్బా.
కుమారి 21 ఎఫ్ కన్నడ రీమేక్ లో నటిస్తున్నావా అని హెబ్బాను అడిగితే.. ‘‘ఈ సినిమాను కన్నడంలో చేయబోతున్నారన్న విషయం నాకూ తెలిసింది. అయితే కన్నడంలో చేయమని ఇంత వరకూ నన్ను ఎవరూ అప్రోచ్ కాలేదు. అడిగితే తప్పకుండా చేస్తాను. కన్నడలో నా తొలి సినిమా ఫ్లాప్ అయింది. కుమారి 21 ఎఫ్ రీమేక్ లో ఛాన్సిస్తే అక్కడ కూడా ఓ హిట్టు కొట్టేస్తాను’’ అని చెప్పింది. ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ హీరోగా ఓ సినిమాను అంగీకరించానని.. ఇంకొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని హెబ్బా చెప్పింది.