Begin typing your search above and press return to search.

పాలిష్‌ పిల్లాడితో హెబ్బా ఏం చేసిందంటే

By:  Tupaki Desk   |   1 April 2017 4:42 AM GMT
పాలిష్‌ పిల్లాడితో హెబ్బా ఏం చేసిందంటే
X
కుమారి హెబ్బా పటేల్ ఇప్పుడు ఆసక్తిగా ''మిష్టర్'' సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అమ్మడు నటించిన నేను నా బాయ్ ఫ్రెండ్స్ ఘోరంగా ఫ్లాప్ కావడంతో.. ఈ మెగా మూవీపైనే ఆశలు పెట్టుకుంది. శ్రీను వైట్ల అండ్ వరుణ్‌ తేజ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఏప్రియల్ 13న రిలీజ్ అవుతుండటంతో.. ఈ సినిమా గురించి ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తున్నాయి.

ఈ సినిమాలో ఒక చిన్న పిల్లాడి క్యారెక్టర్ ఉండటంతో.. ఆ రోల్ కోసం పాలిష్‌ (పోలాండ్ దేశం వారు) పిల్లాడు బ్జిన్యూ (Zbigniew) ను తీసుకున్నారు. అయితే ఇటలీ లో ఈ సినిమాకు సంబంధించిన సీన్లను తీస్తున్నప్పుడు ఆ పిల్లాడితో తెగ క్లోజ్ అయిపోయిందట హెబ్బా. ఇద్దరూ కలసి సెట్లో ఆడుకునేవారు అంటున్నారు సన్నిహితులు. అస్తమానం ఆ పిల్లాడి బుగ్గులు గిల్లేసి.. అతడ్ని ముద్దులాడేసి.. హెబ్బా సంభరపడిపోతే.. అతడు కూడా అమ్మడికి చాక్లెట్లు అవీ గిఫ్టుగా ఇచ్చాడట. మొత్తానికి ఫారిన్ పిల్లాడితో మన లోకల్ బ్యూటి అలా హ్యాపీగా టైమ్ పాస్ చేసిందనమాట.

ఇకపోతే మిష్టర్ సినిమాలో హెబ్బా సెకండ్ హీరోయిన్ రోల్ చేసిందనే టాక్ వినిపిస్తోంది కాని.. హెబ్బా మాత్రం తాను చాలా ముఖ్యమైన రోల్ చేశానని చెబుతోంది. ఏదేమైనా కూడా సినిమా హిట్టయ్యిందంటే హెబ్బా కెరియర్ కొత్త డైమన్షన్ లోకి తిరిగుతుందంతే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/