Begin typing your search above and press return to search.

కవర్‌ చేసుకోమని కుమారికి వార్నింగ్‌

By:  Tupaki Desk   |   18 Nov 2015 7:30 AM GMT
కవర్‌ చేసుకోమని కుమారికి వార్నింగ్‌
X
ఈ మధ్య పబ్లిక్ ఫంక్షన్లు - సినిమా ఈవెంట్లలో హీరోయిన్స్ డ్రసింగ్ చూస్తుంటే.. ఏదో ఫ్యాషన్ షో నుంచి డైరెక్టుగా ఇటు వచ్చేశారేమో అనిపిస్తోంది. ఎక్స్ పోజింగ్ - క్లీవేజ్ షోలు బాగా కామన్ అయిపోయాయి. అప్ కమింగ్ హీరోయిన్స్ మాత్రమే కాదు.. స్టార్లుగా వెలిగిపోతున్నవాళ్లు కూడా ఇదే ఫాలో అయిపోతున్నారు. బాలీవుడ్ కలలు బ్రెయిన్ లో ఉంటున్నాయేమో.. అక్కడి హీరోయిన్స్ స్టైల్ ని మక్కీకి మక్కీ దించేస్తున్నారు.

సమంత - తమన్నా లాంటి స్టార్లు కూడా గత కొంత కాలంగా డోస్ పెంచేశారు. టాలీవుడ్ మూవీస్ లో మనం చూస్తున్న హీరోయిన్స్ వీళ్లేనా అనిపించేలా డ్రస్సులు వేస్తూ.. అందాలు ఆరబోసేస్తున్నారు. కుమారి 21ఎఫ్ హీరోయిన్ హేభా పటేల్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయింది. టీజర్ లాంఛ్ - ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లలో క్లీవేజ్ షోలతో కనువిందు చేసింది. కుమారిని - తనను జనాల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతుగా ఆఫ్ స్క్రీన్ లోనూ అందాలు ఆరబోసేసింది. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చేసింది. మోడ్రన్ అమ్మాయి పద్ధతిగా ఉంటే ఇలా ఉంటుంది అనిపించేలా ఫుల్లుగా కప్పుకుని కనిపిస్తోంది.

దీనికి కారణం సుకుమార్ అని తెలుస్తోంది. తమ సినిమాపై భిన్నమైన టాక్ జనాల్లోకి వెళ్లకుండా, అదో రకమైన బ్యాడ్ ఇమేజ్ పడకుండా ఉండేందుకు.. ఇలా చేయక తప్పలేదుట సుకుమార్ కి. ఇప్పటికే ఏ సర్టిఫికేట్ తో పెద్దలకు మాత్రమే అనిపించుకోవడంతోపాటు.. పబ్లిక్‌ ఫంక్షన్ లో హీరోయిన్‌ గ్లామర్ డోస్ కారణంగా మరీ అడల్ట్ మూవీ అనే టాక్ స్ప్రెడ్ అవుతోంది. దీంతో జాగ్రత్త పడక తప్పలేదు. అందుగా ఫుల్ స్లీవ్ టీ షర్టులు, జీన్స్ ప్యాంట్ లతో ప్రమోషన్ ఈవెంట్స్ కి ఫుల్ గా కవర్‌ చేసుకొని వచ్చేస్తోంది హేభా పటేల్.