Begin typing your search above and press return to search.
అబ్బా హెబ్బా పనైపోయినట్లేనా?
By: Tupaki Desk | 22 Feb 2020 4:10 AM GMTకుమారి 21ఎఫ్ చిత్రంతో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ హెబ్బా పటేల్. ఆ చిత్రం తర్వాత ఈ అమ్మడు సంవత్సరం పాటు కాస్త బిజీగా వరుసగా సినిమాలు చేసింది. కాని కుమారి తర్వాత చేసిన సినిమాలు ఏవీ కూడా హిట్ అవ్వలేదు. ఏ ఒక్క సినిమాలో కూడా ఆమెకు ప్రాముఖ్యత ఉన్న పాత్ర దక్కలేదు. దాంతో హెబ్బా పటేల్ మెల్ల మెల్లగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో ఈ అమ్మడు భీష్మ చిత్రంలో నటించిందని వార్తలు వచ్చాయి.
భీష్మ ప్రమోషన్స్ కార్యక్రమంలో ఆమె కనిపించక పోవడంతో సినిమాలో ఏదో చిన్న రోల్ ను ఆమె చేసి ఉంటుందని భావించారు. అనుకున్నట్లుగానే చిన్న రోల్ ను ఆమె చేసింది. కాని ఆ రోల్ లో ఈ అమ్మడు చేసిన అందాల ప్రదర్శణ అంతా ఇంతా కాదు. చిన్న పాత్రే అయినా పెద్దగా స్కిన్ షో చేసి ఆ పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించింది. కాస్త డెప్త్ గా చెప్పాలంటే వ్యాంప్ పాత్రను హెబ్బా చేసింది. ఇలాంటి పాత్రలకు కూడా ఓకే చెప్పింది అంటే కుమారి కెరీర్ చివరి దశలో ఉన్నట్లే అంటున్నారు.
భీష్మ చిత్రంకు పాజిటివ్ రెప్పాన్స్ వచ్చింది. అయినా కూడా కుమారిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఆమె గురించి అసలు జనాల్లో చర్చే లేదు. ఆమె పాత్ర కోసం చాలా హాట్ సీన్స్ లో నటించినా కూడా వాటిలో కొన్ని ఎడిటింగ్ లో పోగా కొన్ని సీన్స్ లో ప్రాముఖ్యత లేకుండా ఉండటం వల్ల ప్రేక్షకులు వాటిని అప్పటికప్పుడు చూసి మర్చి పోతున్నారు. దాంతో ఈ అమ్మడికి భీష్మ వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే అనుమానమే అంటున్నారు. మొత్తానికి ఈ కుమారి టైం అయిపోయినట్లే అంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.