Begin typing your search above and press return to search.
'సెబాస్టియన్ పి.సి. 524' నుంచి బ్యూటిఫుల్ మెలోడీ..!
By: Tupaki Desk | 17 Feb 2022 12:20 PM GMT'రాజావారు రాణివారు' 'SR కల్యాణమండపం' వంటి సినిమాలతో అలరించిన యువ హీరో కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు ''సెబాస్టియన్ పి.సి. 524'' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
బాలాజీ సయ్యపురెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇందులో నమ్రతా దారేకర్ - కోమలి ప్రసాద్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మరం చేశారు.
''సెబాస్టియన్ పి.సి. 524'' నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలు - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'హేలీ' అనే పాటను మేకర్స్ రిలీజ్ చేసారు.
'నీ మాట వింటే రాదా మైమరపే.. నీ పేరు వింటే రాదా మైమరపే.. నేను ఎవరో ఎవరో తెలిసింది నీ వల్లే..' అంటూ సాగిన ఈ గీతం శ్రోతలను అలరిస్తోంది. హీరోయిన్ ని ప్రేమిస్తున్న మన హీరో.. ఆమె పక్కన ఉంటే ఎలా ఉంటుందో ఈ సాంగ్ లో చెబుతున్నాడు.
ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. విజువల్ గా కూడా 'హేలీ' పాట ఆకట్టుకుంటోంది. జిబ్రాన్ ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. సింగర్ కపిల్ కపిలాన్ ఆలపించగా.. భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించారు. రాజ్ కె.నల్లి సినిమాటోగ్రఫీ అందించగా.. విప్లవ్ ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేసారు. కిరణ్ మామిడి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవరించారు.
ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై ప్రమోద్-రాజు లు సంయుక్తంగా 'సెబాస్టియన్ పి.సి. 524' చిత్రాన్ని నిర్మించారు. సిద్దారెడ్డి - జయచంద్రా రెడ్డి సహ నిర్మాతలు.
రేచీకటితో బాధపడే ఓ పోలీసు కానిస్టేబుల్.. తన లోపాన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడనే కథాంశంతో ఈ కామెడీ థ్రిల్లర్ ని తెరకెక్కించారు. రోహిణి - సూర్య - ఆదర్శ్ బాలకృష్ణ - శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
'సెబాస్టియన్' చిత్రాన్ని ఫిబ్రవరి 25వ తేదీన తెలుగు తమిళ భాషలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. అయితే ఇప్పుడు 'భీమ్లా నాయక్' సినిమా అదే రోజున థియేటర్లలోకి తీసుకొస్తుండటంతో.. కిరణ్ అబ్బవరం వెనక్కి తగ్గారని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ సరికొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించే అవకాశం ఉంది.