Begin typing your search above and press return to search.

మొదటి రోజు వసూళ్లు - సరిపోలేదు గురు!!

By:  Tupaki Desk   |   19 Oct 2018 8:11 AM GMT
మొదటి రోజు వసూళ్లు - సరిపోలేదు గురు!!
X
నిన్న దసరా పండగ సందర్భంగా విడుదలైన హలో గురు ప్రేమ కోసమే మిక్స్డ్ టాక్ మధ్య మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంది. దిల్ రాజు టీం ఇది రామ్ కెరీర్ లోనే టాప్ అని పబ్లిసిటీ చేస్తున్నప్పటికీ రెండో ప్లేస్ లోనే నిలిచింది. చెప్పుకోదగ్గ సంఖ్యలో స్క్రీన్లను దక్కించుకోవడంతో పాటు థియేటర్ ఆక్యుపెన్సీ బాగా మైంటైన్ చేసిన హలో గురు ప్రేమ కోసమే ఫస్ట్ డే వచ్చిన షేర్ 4 కోట్ల 25 లక్షలుగా ట్రేడ్ రిపోర్ట్. పందెం కోడి 2 పోటీతో పాటు గత వారం వచ్చి స్ట్రాంగ్ గా ఉన్న అరవింద సమేత వీర రాఘవ వల్ల హలో గురుకు కొంత ఎఫెక్ట్ పడక తప్పలేదు. దానికి తోడు యూనానిమస్ గా హిట్ టాక్ ఇంకా రాలేదు కాబట్టి ఎంతమేరకు ఇది నిలబెట్టుకుంటుంది అనేది వీక్ డేస్ లో తేలిపోతుంది. 24 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న హలో గురు ప్రేమ కోసమే ముందు పెద్ద సవాలే ఉంది. ఇక ఏరియా వారీగా లెక్కలు చూస్తే

నైజామ్ - 1 కోటి 53 లక్షలు

సీడెడ్ - 49 లక్షలు

ఉత్తరాంధ్ర - 46 లక్షలు

గుంటూరు - 33 లక్షలు

కృష్ణా - 28 లక్షలు

ఈస్ట్ గోదావరి - 27 లక్షలు

వెస్ట్ గోదావరి - 26 లక్షలు

నెల్లూరు - 13 లక్షలు

తెలుగు రాష్ట్రాలు డే 1 షేర్ : 3 కోట్ల 75 లక్షలు

యుఎస్ : 15 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా : 35 లక్షలు

ప్రపంచవ్యాప్త మొదటి రోజు షేర్ : 4 కోట్ల 25 లక్షలు

ఈ వారాంతం ఇంకా మూడు రోజులు ఉంది. సెలవులు కంటిన్యూ అవుతున్నాయి. స్కూళ్ళు కాలేజీలు సోమవారం నుంచి తెరుచుకోబోతున్నాయి. కాబట్టి సాధారణంగా వచ్చే వీకెండ్ కలెక్షన్స్ కంటే కాస్త ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే పందెం కోడి 2-అరవింద సమేత వీర రాఘవలతో ధీటుగా నిలబడినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇంకా 20 కోట్ల షేర్ టార్గెట్ గా ఉంది కాబట్టి గురుడి ప్రయాణం అంత ఈజీగా అయితే ఉండదు.

Disclaimer: Figures mentioned here have been collected from few sources and also include estimates. Authenticity can't be guaranteed...!