Begin typing your search above and press return to search.
ఏంటి గురు అప్పుడే వచ్చేసావ్
By: Tupaki Desk | 26 Nov 2018 1:30 AM GMTసినిమాల డిజిటల్ హక్కులు శాటిలైట్ తో పాటు థియేట్రికల్ రన్ మీద ప్రభావం చూపిస్తున్న వాస్తవాన్ని నిర్మాతలు అంగీకరించకపోయినా ఈ కఠిన సత్యం ముందు ముందు ఇంకా తేటతెల్లమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లోగోని టైటిల్ కార్డ్స్ లో చూడగానే అరె కొద్దిరోజులు ఆగితే ఫ్రీగా హెచ్డి క్లారిటీ తో చూసేవాళ్లమే అని అనుకుంటున్న ప్రేక్షకులకు కొదవలేదు. పోనీ వీటిని వంద రోజులు అయ్యాక పెడుతున్నారా అంటే అంత సీన్ కనిపించడం లేదు.
ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే రామ్ హీరోగా నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో వచ్చిన హలో గురు ప్రేమ కోసమే అక్టోబర్ 18న విడుదలైంది. ఇంకా పట్టుమని నలభై రోజులు కుడా దాటలేదు. చాలా కేంద్రాల్లో ఫుల్ రన్ క్లోజ్ అయ్యింది కాని మెయిన్ సెంటర్స్ లో కొన్ని చోట్లా వేరే ఆప్షన్ లేక లాగిస్తున్న వాళ్ళు లేకపోలేదు. మొన్న అర్ధరాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్ లో హలో గురు ప్రేమ కోసమే స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. అంటే సరిగ్గా 35 రోజులకన్న మాట.
ఇది చాలా చిన్న వ్యవధి. గతంలో దిల్ రాజు నిర్మించిన మరో సినిమా ఏంసిఏ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగానే అమెజాన్ ప్రైమ్ లో రావడం మీద డిస్ట్రిబ్యూటర్లు అసంతృప్తి వ్యక్తం చేసారు. రంగస్థలం 45 రోజులకే వచ్చినప్పుడు అభిమానులు షాక్ తిన్నారు. ఇప్పుడిది మరింత కుంచించుకుపోయి ఏకంగా 35 రోజులకు తగ్గిపోవడం చూస్తే భవిష్యత్తులో ఇది రెండు మూడు వారాలకు దిగిపోతుందేమో అని ఆందోళన చెందుతున్నారు బయ్యర్లు. నిర్మాతకు ఇది ఆదాయ వనరే అయినప్పటికీ మరీ ఇంత త్వరగా రావడం మొదలైతే పోస్టర్ లోనే డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ పేరు చూసి జనం ధియేటర్ దాకా ఏం వెళ్తాంలే అనుకుంటేనే అసలు చిక్కు. ఈ 35 రోజుల నిడివి ఇంతకు మించి తగ్గకూడదు అని కోరుకోవడం తప్ప ఎవరు మాత్రం చేయగలిగింది ఏముంది