Begin typing your search above and press return to search.
క్లబ్బులోకి అడుగుపెట్టేసిన అఖిల్
By: Tupaki Desk | 24 Dec 2017 3:28 PM GMT‘హలో’ సినిమాతో తన చిన్న కొడుకు అఖిల్ ను హీరోగా రీలాంచ్ చేస్తున్నట్లుగా మళ్లీ మళ్లీ చెప్పాడు అక్కినేని నాగార్జున. ఆయన మాట నిజమయ్యేట్లే ఉంది. పాజిటివ్ టాక్.. పాజిటివ్ రివ్యూలతో మొదలైన ‘హలో’ వసూళ్లు కూడా బాగానే రాబడుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ చిత్రం అదరగొడుతోంది. రిలీజైన రెండో రోజుకే ‘హలో’ హాఫ్ మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టేయడం విశేషం.
గురువారం ప్రిమియర్ షోలతో 2.13 లక్షల డాలర్లు కొల్లగొట్టిన ఈ చిత్రం.. రిలీజ్ రోజు.. శుక్రవారం 1.52 లక్షల డాలర్లు వసూలు చేసింది. రెండో రోజు.. శనివారం కూడా స్టడీగా సాగిన ఈ చిత్రం 1.48 లక్షల డాలర్లు వసూలు చేసింది. మొత్తంగా ‘హలో’ వసూళ్లు శనివారానికే 5.14 లక్షల డాలర్లకు చేరుకున్నాయి. అఖిల్ తొలి సినిమా ‘అఖిల్’ ఫుల్ రన్లో 1.6 లక్షల డాలర్లు మాత్రమే వసూలు చేయగా.. ప్రిమియర్లతోనే ఆ మార్కును దాటేసింది ‘హలో’.
రెండో సినిమాతోనే హాఫ్ మిలియన్ క్లబ్బులోకి చేరడమంటే చిన్న విషయమేమీ కాదు. యుఎస్ ఆడియన్స్ టేస్టుకు తగ్గ క్లాస్ లవ్ స్టోరీ కావడం.. విక్రమ్ కుమార్ సినిమాలకు ముందు నుంచి అక్కడ మంచి ఆదరణ ఉండటం ‘హలో’కు కలిసొచ్చింది. ఆదివారం కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చే అవకాశముంది. సోమవారం క్రిస్మస్ సెలవు కూడా కలిసొస్తోంది. కాబట్టి ఈ చిత్రం మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు.