Begin typing your search above and press return to search.
హలో.. అక్కడ కష్టంగానే ఉంది
By: Tupaki Desk | 15 Dec 2017 10:20 AM GMTఈ రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్ అనేది తెలుగు సినిమాలకు కీలకంగా మారింది. అక్కడి ప్రేక్షకుల అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయడం.. మార్కెట్ పెంచుకోవడం హీరోలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకునే రామ్ చరణ్ లాంటి మాస్ హీరోలు కూడా క్లాస్ కథల వైపు అడుగులేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న హీరోలు కూడా ఓవర్సీస్ ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని సినిమాలు ఎంచుకుంటున్నారు.
ఐతే అక్కినేని యంగ్ హీరో అఖిల్ మాత్రం తన తొలి సినిమా విషయంలో పెద్ద తప్పటడుగు వేశాడు. అరంగేట్రంలోనే ‘అఖిల్’ లాంటి మాస్ మసాలా సినిమా ట్రై చేశాడు. ఆ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ దారుణంగా బోల్తా కొట్టింది. ఓవర్సీస్ బయ్యర్లు బాగా దెబ్బ తిన్నారు ఆ సినిమాకు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ‘హలో’ మీద కూడా పడేలా కనిపిస్తోంది. ఓవర్సీస్ లో మంచి రికార్డున్న విక్రమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించినప్పటికీ అఖిల్ ట్రాక్ రికార్డు.. అతడికి ఓవర్సీస్ లో ఇంకా ఫ్యాన్ బేస్ ఏర్పడకపోవడం ప్రతికూలంగా మారుతోంది. ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బజ్ రాలేదని అక్కడి ట్రేడ్ పండిట్లు అంటున్నారు. ప్రిమియర్స్ కు పెద్దగా టికెట్లు తెగకపోవచ్చని.. ఫస్ట్ వీకెండ్ ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా అక్కడి వాళ్లకు అంతగా ఎక్కట్లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఫిదా’కు చేసినట్లుగా రిలీజ్ ముంగిట క్లాస్ టచ్ ఉన్న మరో ట్రైలర్ వదలాలని నాగ్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎలాగోలా ‘హలో’ ఓవర్సీస్ హక్కుల్ని రూ.3 కోట్లకు అమ్మేయగలిగారు కానీ.. ఇప్పుడా పెట్టుబడి రికవర్ చేసేలా ఈ చిత్రం మిలియన్ మార్కును అందుకుంటుందా అన్న గుబులు కనిపిస్తోంది. మరి ‘హలో’ ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.