Begin typing your search above and press return to search.
'హలో' టీజర్.. యుట్యూబ్ నుండి ఔట్
By: Tupaki Desk | 29 Nov 2017 10:10 AM GMTఇప్పుడు హాట్ టాపిక్ ఏంటయ్యా అంటే.. అఖిల్ కొత్త సినిమా ''హలో'' టీజర్ ను యుట్యూబ్ నుండి తీసేశారు. అసలు సడన్ గా హలో టీజర్ కాపీరైట్స్ కారణంగా మాయం అయిపోవడం ఏంటి? అది పొరపాటను జరిగిందా.. లేదంటే అప్పట్లో ఆగడు సినిమా టీజర్ కు ఓవర్ గా లైకులు వచ్చాయంటూ బ్యాన్ చేసిన యుట్యూబ్.. అలా ఏమైనా చేసిందా?
సాధారణంగా అన్నపూర్ణ స్టూడియోస్ వారు 'హలో' డిజటాల్ రైట్స్ ను వేరెవరికైనా అమ్మేస్తే.. అప్పుడు సదరు వీడియో పబ్లిషింగ్ రైట్ లేని వాళ్ల ఛానల్స్ నుండి వీడియో తొలగించబడుతుంది. కాని అన్నపూర్ణ స్టూడియో వారి సొంత చిత్రమైన ఈ సినిమా తాలూకు డిజిటల్ రైట్స్ వేరేవారికి ఇచ్చే ఛాన్సు ఉండదు. కాని ఇక్కడ విషయం ఏంటంటే.. అసలు హలో టీజర్ కోసం అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశాడు అనుకుంటున్న మ్యూజిక్ అతనిది కాదట.
ఫిన్ ల్యాండ్ కు చెందిన 'ఎపిక్ నార్త్' అనే ఒక కంపెనీ.. టీజర్స్ కోసం ప్రత్యేకంగా మ్యూజిక్ తయారుచేస్తుంది. వారు ఎంతో క్వాలిటీగా కంపోజ్ చేసి తయారుచేసే మ్యూజిక్ మనం కొనుక్కోవచ్చు. అలా కంపోజ్ చేసిన 'ఎక్సోసూట్' అనే మ్యూజిక్ ను.. యాజిటీజ్ హలో కోసం వాడేసుకున్నారు. కాని కాపీరైట్ కోసం డబ్బులు చెల్లించకుండా వాడుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారా? అందుకే కాపీ రైట్ క్లయిమ్ వేయడంతో.. యుట్యూబ్ లో హలో టీజర్ ఎగిరిపోయింది. అసలు అలా మ్యూజిక్ కొట్టేయడానికి నాగ్ అండ్ విక్రమ్ కుమార్ ఎలా ఒప్పుకున్నారో?