Begin typing your search above and press return to search.
ఫ్రెండ్ షిప్ పాయింట్ అదేనా గురు ?
By: Tupaki Desk | 17 Oct 2018 7:11 AM GMTరేపు విడుదల కాబోతున్న రామ్ పోతినేని హలో గురు ప్రేమ కోసమే మీద భీభత్సమైన హైప్ లేదు కానీ ఎంటర్ టైన్మెంట్ ని ఇష్టపడే ప్రేక్షకులు మాత్రం త్రినాధరావు మార్కుతో బాగానే ఉండొచ్చనే అంచనాలో ఉన్నారు. టీజర్ మెప్పించినా ట్రైలర్ మాత్రం కాస్త రొటీన్ స్టఫ్ లాగే అనిపించడం కొంత ప్రభావం చూపించినా ఫైనల్ గా కంటెంట్ ఉంటేనే బాక్స్ ఆఫీస్ దగ్గర నిలిచే అవకాశం ఉంటుంది. అదలా ఉంచితే ఇందులో హీరో రామ్ ప్రకాష్ రాజ్ పాత్రల మధ్య ఫ్రెండ్ షిప్ గురించి ఇప్పటికే కొంత ఆసక్తి నెలకొంది. ట్రైలర్ లో గమనిస్తే అనుపమ పరమేశ్వరన్ ప్రకాష్ రాజ్ కూతురని తెలియకుండా రామ్ ఆమెను ప్రేమిస్తాడు. అది తెలియని ప్రకాష్ రాజ్ రామ్ ను దగ్గరుండి మరీ ఎంకరేజ్ చేస్తాడు. ఇక అక్కడి నుంచి మంచి ఫన్ గేర్ లో సినిమా మలుపు తిరిగేలా ఉంది.
కట్ చేసి కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే సుమంత్ హీరోగా 2003లో సత్యం అనే సినిమా వచ్చింది. అందులో హీరోయిన్ జెనీలియా తండ్రి కోట శ్రీనివాసరావు. ఈ విషయం తెలియకుండానే కోట-సుమంత్ ల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడుతుంది. తాను ఇష్టపడే అమ్మాయే కోట కూతురని సుమంత్ తర్వాత తెలుసుకుంటాడు. కాకపోతే ఇందులో ఘోస్ట్ రైటర్ గా క్యాబ్ డ్రైవర్ గా సుమంత్ కనిపిస్తే హలో గురు లో రామ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అల్లరి చేస్తాడు. కథలో ఈ లైన్ మాత్రమే సత్యంతో సింక్ అవుతోంది. లేదూ రేపు తెరమీద ఇంకేదైనా డిఫరెంట్ ట్విస్ట్ ఇస్తారేమో చూడాలి. ఒకపక్క అరవింద సమేత వీర రాఘవ స్ట్రాంగ్ గా ఉండటంతో పాటు మరోపక్క విశాల్ మరో ఫ్యాక్షన్ కథ పందెం కోడి 2తో రేస్ లో ఉన్నాడు. మొత్తానికి గురు నడక అంత ఈజీగా ఉండబోవడం లేదు