Begin typing your search above and press return to search.

హేమ మామూలుగా ఫైర్ అవ్వలేదే!!

By:  Tupaki Desk   |   18 March 2017 4:31 AM GMT
హేమ మామూలుగా ఫైర్ అవ్వలేదే!!
X
'మేము స్నానం చేస్తున్న వీడియో ఎవడో నెట్ లో పెట్టాడు. దాన్ని డౌన్ లోడ్ చేసి వేరేవాడెవడో.. హేమ శృంగార లీలలు అంటూ పెట్టాడు. వాడి ఫ్యామిలీని పెంచుకోవడానికి.. ఏదైనా చేయచ్చు. ఫలానా అమ్మాయి అక్కడ దొరికింది ఇక్కడ దొరికిందంటూ.. స్క్రోలింగ్ లతో హంగామా చేస్తారు. ఆడపిల్ల ఏడుపు మీద వచ్చే కోటి రూపాయలు మీ ఛానల్ కు అంత ముఖ్యమా. దానితో మీ పెళ్లాం పిల్లలను బతికించుకుంటారా? ఇండస్ట్రీ వాళ్లు మాకు ఇల్లు ఇవ్వడానికి భయపడతారు. మా మీద బతికే వెధవకు మాత్రం ఇల్లిస్తారు. ఇండస్ట్రీలో వాళ్లంటే ఎందుకు అంత చులకన' అని నిలదీసింది హేమ.

గత రెండు రోజులుగా ఇండస్ర్టీలో ఆమె ఇచ్చిన ఒక సెన్సేషనల్ ఇంటర్యూ మైలైట్ అయిపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఇంటర్యూలో అమ్మడు అమ్మాయిలపై రాతలు రాసుకుని న్యూసులు వేసుకుని.. మీడియావారు కోట్లు సంపాదిస్తున్నారంటూ ఏకేసింది. 'అంత పెద్ద ఛానల్ ఉన్న నీకు.. ఆడవాళ్ల మీద కెమేరాలపై పెట్టే బదులు.. ఆ వెబ్ సైట్లపై పెట్టచ్చు కదా. ఇప్పుడు 15 ఏళ్ల నా కూతురు ప్రశ్నిస్తే ఏం చెప్పగలను. మా ఫ్యామిలీలను అలా చూపించి మీరు ఏం సాధిస్తారు.. ఎవరైనా అమ్మాయి అలాంటి పని చేస్తే అండగా నిలవండి. ఆడపిల్లలకు అండగా మేమున్నాం అని చెప్పండి' అంటూ హితవు పలికింది ఈ సీనియర్ నటి.

'మాకు 40 ఏళ్లు వచ్చాయ్. ముసలోళ్లం అయిపోయాం.. మీ పెళ్లాం బిడ్డలను అలా వాడుకోవచ్చు కదా. ఇండస్ట్రీలో ఆడవాళ్లపై అంత చిన్న చూపా.. మా సొంత ట్యాలెంట్ తో మేం బతుకుతూ మీకు ఎంటర్టెయిన్మెంట్ ఇస్తున్నాం. అలాంటి మాపై అంత చులకన భావమా' అని అడిగిన హేమ.. 'చెడు ప్రతీ చోటా.. ప్రతీ ఇంట్లోనూ ఉంటుంది. అలాంటిది ఇండస్ట్రీపైనే వేలెత్తి చూపించడం సరికాదు. ఇండస్ట్రీ గొప్పది. తెలంగాణ వాళ్లా.. ఆంధ్రా వాళ్ల అన్నది చూసి.. వేషాలు.. అవకాశాలు ఇవ్వడం జరగదు' అని చెప్పిన హేమ.. సోషల్ మీడియాపై యుద్ధం చేయబోతున్నట్లు చెప్పింది.

'సోషల్ మీడియాపై వర్క్ జరుగుతోంది. ఎవడైనా ఒక అమ్మాయి గురించి ఒక అక్షరం తప్పు రాద్దామనే ధైర్యం కూడా నా కొడుకులకు రాకూడదు. ఒక బ్రోకర్ కి అయినా ఓ విలువ ఉంటుంది. సోషల్ మీడియా వెధవలకు అది కూడా లేదు. ఒక బ్రోకర్ ఆ అమ్మాయి ఇష్టపడి వస్తాను అంటే.. వేరేవాడిని తీసుకొస్తాడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎవరి పర్మిషన్ లేకుండానే.. ఆ అమ్మాయిపై బతుకుతున్నావంటే నువ్వెంత పెద్ద వెధవవో ఆలోచించు' అంటూ ఫైర్ అయింది హేమ.




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/