Begin typing your search above and press return to search.
శ్రీరెడ్డిని అక్క పాత్రలో ఊహించగలమా:హేమ
By: Tupaki Desk | 8 April 2018 8:45 AM GMTనటి శ్రీరెడ్డి శనివారం నాడు ఫిల్మ్ ఛాంబర్ ఎదుట చేసిన అర్ధనగ్న ప్రదర్శన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ పై చాలామంది నటీనణులు తమ గళం విప్పినా...ఈ స్థాయిలో నిరసన తెలిపిన మొదటి మహిళ శ్రీరెడ్డి అని చెప్పవచ్చు. అయితే, తన సమస్యలను పరిష్కరించాలని శ్రీరెడ్డి నిరసన తెలిపిన విధానంపై `మా` సభ్యులు మండిపడుతున్నారు. శ్రీరెడ్డి ఎంచుకున్న విధానం సరికాదని‘మా’ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇటువంటి పనులు చేసి టాలీవుడ్ పరువు తీస్తే ‘మా’ సభ్యత్వం ఇవ్వమని `మా`సభ్యులంతా ప్రెస్ మీట్ లో ముక్తకంఠంతో చెప్పారు. తాజాగా, శ్రీరెడ్డి ఎపిసోడ్ పై `మా` కౌన్సిల్ లో కీలక సభ్యురాలైన నటి హేమ మండిపడింది. నిరసన తెలపడానికి శ్రీరెడ్డికి చాలా మార్గాలున్నాయని - బట్టలిప్పుకొని రోడ్డెక్కడం సరికాదని - విప్పుకుంటే వేషాలిస్తారనుకోవడం సరికాదని శ్రీరెడ్డిపై హేమ ఫైర్ అయింది.
మా మెంబర్ షిప్ కోసం శ్రీరెడ్డి తమను సంప్రదించిందని, అప్లికేషన్ కూడా ఇచ్చామని హేమ తెలిపింది. కనీసం ఫొటోలు కూడా అతికించకుండా - డీడీ తీయకుండా - అసంపూర్తిగా అప్లికేషన్ ఇస్తే ఎలా అంగీకరిస్తామని హేమ ప్రశ్నించింది. తాను నటిగా 375 సినిమాలు చేశానని - తాను ఎక్కడా శ్రీరెడ్డిని గుర్తించలేదని చెప్పింది. తెలుగు సినిమా కోసం శ్రీరెడ్డి ఏం త్యాగాలు చేసిందని ఆమెకు ఫ్రీ మెంబర్ షిప్ ఇవ్వాలని హేమ ప్రశ్నించింది. ఆమెను ఇంట్రడ్యూస్ చేయడానికి ఇద్దరు మెంబర్ల సంతకాలు కావాలని - కనీసం ఒక్క సంతకం కూడా ఆమె పెట్టించలేకపోయిందని తెలిపింది. `మా`లో సభ్యత్వం కోసం చాలా మంది అప్లకేషన్లు పెండింగ్ లో ఉన్నాయని, వారికివ్వకుండా శ్రీరెడ్డికి ఇవ్వడం కుదరదని చెప్పింది. అయితే, తన సమస్యలపై శ్రీరెడ్డి అప్రోచ్ అయిన విధానం తమకెవ్వరికీ నచ్చలేదని, నిరసనలు తెలిపేందుకు మౌన పోరాటం వంటి మార్గాలను ఎంచుకోకుండా అర్ధనగ్న ప్రదర్శనతో రోడ్డెక్కడం సరికాదని హేమ తెలిపింది. శ్రీరెడ్డి వంటి వారు చేసే పనుల వల్ల టాలీవుడ్ పరువు పోతోందని, ఇటువంటి పరిశ్రమలో ఉన్నామా అనిపిస్తోందని హేమ ఆవేదన వ్యక్తం చేసింది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దొరకడం లేదని శ్రీరెడ్డి ఆరోపించడం సరికాదని, తాను కూడా తెలుగమ్మాయినేనని హేమ చెప్పింది. టాలెంట్ ఉన్నవాళ్లకు అవకాశాలు వస్తాయని, శ్రీరెడ్డిని చూస్తే అక్క - చెల్లె - వదిన పాత్రల్లో ఊహించుకోగలమా? అని హేమ ప్రశ్నించింది. ఇండస్ట్రీలో రాణించడం అదృష్టం అని, ఒక సినిమా హిట్టయితే 10 సినిమాలొస్తాయని, లేదంటే లేదని తెలిపింది.